డయాలసిస్ బాధితునికి ఆర్ధిక సాయం అందించరూ

కుటుంబానికి అవసరమైన వయసులో ఆరోగ్యం పాడై అటు కుటుంబాన్ని పోషించలేక రెక్కలు ముక్కలు చేసుకొంటూ భాగస్వామి సహకారం తో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఒక వ్యకి పడుతున్న బాధ ఇది సరిగ్గా ఏడేళ్ల క్రితం ఉన్నట్టుండి జ్వరం రావడం ఆ వెంటనే డాక్టర్లు పరీక్షచేసి కిడ్నీఫెయిల్యూర్  అని చెప్పడం చక చక జరిగి పోయాయి ..ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆ బాధితుడు కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూ సికింద్రాబాద్ లోని ఒక చిన్న ఇంట్లో వుంటూ భాగస్వామి తో కలిసి ఉద్యోగం చేసుకొంటూ వారానికి మూడు సార్లు కృష్ణ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ లో డయాలసిస్ తీసుకొంటున్నాడు ఐతే ఇప్పటివరకు ఉన్న ఆర్ధిక స్థోమత , అడపాదడపా దాతల సహకారం తో నెట్టుకొచ్చిన ప్రస్తుతం ఆ పరిస్థితి కూడా లేదు.

 kidny

ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం జీవన్దాన్ లోఅప్ప్లై చేసుకున్న ఇంకా అక్కడ నుంచి ఎలాంటి రెస్పాన్న్స్ రాలేదు ప్రస్తుతం సదరు బాధితునికి డయాలసిస్ కోసం ఆర్ధిక సాయం అవసరం .ఇద్దరు చిన్నారులను చదివిస్తూ కుటుంబ పోషణకోసం శ్రమిస్తూ తనవంతు నైతిక కర్తవ్యమ్ కోసం పోరాడుతున్న ఈ కుటుంబానికి ఆర్ధిక సాయం చేయాలనీ వీరు పడుతున్న ఇబ్బంది నిజమైనది అని మార్నింగ్ 7ఏఎం.కామ్  రూఢి చేసుకొన్న తరువాతనే సైట్ లో వీరి అభ్యర్థిత్వాన్ని పోస్ట్ చేయడం జరుగుతోంది ..దాతలు మానవతా వాదులు స్పందించి సదరు బాధితుడు మూర్తి కుటుంబాన్ని అడ్డుకోవాలని కోరుతున్నాం. బాధితునికి సాయం చేయాలి అనుకొనే వారు సైట్ అడ్మిన్ మొబైల్ నెంబర్ ను సంప్రదిస్తే వారి వివరాలను అందజేస్తాము అంతే సాయం చేసిన వారి వివరాలను కూడా ప్రకటిస్తాం

..మా నెంబర్ 955-314-8714.(వాట్సాప్ )

 ]]>