శరీరానికి కిడ్నీ చేసే మేలు

చూడటానికి చిక్కుడు గింజ అంతే వున్నాయికదా ఏవి మనల్ని ఏం చేస్తాయిలే అనుకొంటున్నారా , చూడటానికే కంటికి అవి చిక్కుడు గింజల్లా కనిపిస్తాయి కానీ వాటి పని తీరు అమోఘం, మొత్తం శరీరానికి కావాల్సిన రక్తాన్ని శుభ్ర పరిచే  యంత్రాలవి, వీటిని అశ్రద్ధ చేసారో  ఓ నాలుగు రాళ్లు  వెనకేసుకున్నట్టే , ఆ రాళ్ల్లుపెట్టే బాధ అంత ఇంత కాదు , ఆ నాలుగు రాళ్ళూ ఏ చిక్కుడు గింజల్లో చేర కుండా ఉండాలంటే ముఖ్యం గా మంచి నీళ్లు బాగా  తాగాలి ,కంటి నిండా నిద్ర, సరైన వ్యాయామం  ఉండాలి ,ఎందుకంటె రీరంలోని కీలక అవయాల్లో మూత్రపిండాలు ప్రధానమైనవి. ఇవి దెబ్బతింటే మనిషి నాణ్యమైన జీవితం కోల్పోతాడు. వీటిని పరరిక్షించుకోవడం ముఖ్యం. జిల్లాలో క్రమేపీ మూత్రపిండాల రోగుల సంఖ్య పెరుగుతోంది. కిడ్నీ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏటా మార్చి నెల రెండో గురువారం వరల్డ్‌ కిడ్నీ డే నిర్వహిస్తున్నారు. నడుం వెనుక భాగంలో చిక్కుడు గింజ ఆకారంలో రెండు మూత్రపిండాలు ఉంటాయి.

సాధారణ వ్యక్తులో పోలీస్తే స్థూలకాయుల్లో మూత్రపిండాల జబ్బులు దరిచేరే అవకాశం ఎక్కువ.. వీరిలో కిడ్నీలపై ఒత్తిడి అధికంగా పడి దీర్ఘకాలంలో వైఫల్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. వీరిలో శరీర బరువుకు తగినట్లుగా జీవక్రియలు అధికంగా జరుగుతాయి. దీని వల్ల కిడ్నీలపై భారం పెరుగుతుంది. కిడ్నీల్లో ఉండే నెఫ్రాన్లపై ఒత్తిడి పెరిగి క్రమేపీ కిడ్నీల పనితీరు మందగించి వైఫల్యానికి దారి తీస్తాయి. మధుమేహం, అధిక రక్తపోటు ఉన్న వారిలో కిడ్నీలు మరింత వేగంగా దెబ్బతినే అవకాశం ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.

మూత్రపిండాల వ్యాధికి గురైన వారిలో కాళ్లు, ముఖం వాపు, నీరసం, ఆకలి లేకపోవడం, అధిక రక్తపోటు, ఆయాసం, ఎముకల నొప్పులు ఉంటాయి. జీఎ్‌ఫఆర్‌ పరీక్ష ద్వారా కిడ్నీల వడపోత సామర్ద్యం తెలుసుకోవచ్చు. జీఎ్‌ఫఆర్‌ విలువ 60 మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉంటే కిడ్నీ జబ్బు ఉన్నట్లు భావిస్తారు.

కిడ్నీ జబ్బు తొలి దశలో ఉన్నవారికి వ్యాధి మరింత ముదరకుండా వైద్యులు చికిత్సలు చేస్తారు. కిడ్నీల పనితీరు మెరుగయ్యే వరకు మందులతో పాటు డయాలసిస్‌ చేయిస్తారు. యోగా, వ్యాయామం, శరీర బరువు తగ్గించుకోవడం వంటివి పాటించాలి. బీపీ, షుగర్‌ పూర్తి నియంత్రణలో ఉంచుకోవాలి. మాంసాహారానికి దూరంగా ఉండాలి.

]]>