ఈడోరకం-ఆడోరకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి సూపర్‌హిట్ చిత్రాలు తర్వాత ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్లో వస్తున్న చిత్రం `అంధగాడు`. కుమారి 21 ఎఫ్, ఈడోరకం-ఆడోరకం వంటి విజయవంతమైన చిత్రాలతో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న రాజ్‌తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్నారు.సక్సెస్ఫుల్ రైటర్ వెలిగొండ శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈచిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో డా.రాజేంద్రప్రసాద్ కీలకపాత్ర పోషిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రారంభమైన ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రస్తుతం టాకీ పార్ట్ పూర్తయ్యింది.సినిమాను మే 26న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీ లో ఆశిష్ విద్యార్థి, రాజా రవీంద్ర, షాయాజీ షిండే, సత్య, పరుచూరి వెంకటేశ్వర రావు తదితరులు తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః బి.రాజశేఖర్, సంగీతంః శేఖర్ చంద్ర, ఆర్ట్ః కృష్ణ మాయ, చీఫ్ కోడైరెక్టర్ః సాయి దాసం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః కిషోర్ గరికపాటి, సహ నిర్మాతః అజయ్ సుంకర, నిర్మాతః రామబ్రహ్మం సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు,దర్శకత్వంః వెలిగొండ శ్రీనివాస్.
]]>