రకుల్ కి కోలివుడ్ బంపర్ ఆఫర్

సరైనోడు,ధ్రువ వంటి భారీ హిట్ లు ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ కు కోలీవుడ్ నుంచి మరో భారీ ఆఫర్ వచ్చింది.ఇప్పటికే మహేశ్ బాబు హీరోగా మురుగదాస్ రూపొందిస్తున్న భారీ చిత్రంలో కూడా నటిస్తోంది.ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలతో బిజీగా వున్న రకుల్ కి మరో మంచి ఆఫర్ వచ్చింది.ప్రముఖ నటుడు సూర్య సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ.

సూర్య నటించిన ‘సింగం 3’ సినిమా భారీ కలెక్షన్ల వసూళ్లు చేస్తోంది.సూర్య,తన తదుపరి చిత్రాన్ని సెల్వరాఘవన్ దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర రకుల్ ప్రీత్ సింగ్ చేస్తోందట.మహేష్ తో చేస్తున్న చిత్రం కూడా తమిళం లో విడుదులవుతుందట.అలాగే సూర్య చిత్రం కూడా కోలీవుడ్ లో తనకు మంచి ప్రాజక్ట్ అవుతుందని రకుల్ భావిస్తోంది.

]]>