టాలీవుడ్లో దశాబ్ధం పైగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన ప్రియమణి కాస్త గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాలో నటిస్తోంది.కన్యాదానం, సూపర్ వంటి విలక్షణమైన సినిమాలతో తెలుగులో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఉపేంద్ర ఇటీవలే `సన్నాఫ్ సత్యమూర్తి` చిత్రంలో ఓ వైవిధ్యమైన పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరి కలయికలో ఆర్. ఉదయరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఉపేంద్ర – ప్రియమణి హీరో హీరోఇన్లుగా నటించిన `కల్పనా 3` పోస్టర్ని మాజీ గవర్నర్ శ్రీ కొణిజేటి రోశయ్య హైదరాబాద్లో లాంచ్ చేశారు. పలు విజయవంతమైన చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఏప్రిల్ 21న తెలుగులో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.