కేటీఆర్ – తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కానున్నారా ?

తెలంగాణ రాష్ట్ర  సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ముఖ్య మంత్రి  చంద్ర శేఖర రావు  కుమారుడు  కే తారక రామారావుబాధ్యతలు స్వీకరించనున్నారా ? ఇప్పుడు  తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ లో హాట్ టాపిక్ గా  మారుతోంది ఈవిషయం..ప్రస్తుతం తెలంగాణ కాబినెట్ లో పంచాయతీ రాజ్ ,ఐటీ శాఖ మంత్రి గా ఉన్న అయన పార్టీ ని నడిపించే విషయం లో తండి కెసిఆర్ నే ఫాలో అవుతు అయన అడుగు జాడల్లోనే నడుస్తున్నారట, ఐతే ఇదిలా ఉండగా కేటీఆర్ మాత్రం ఈ విషయాన్ని కొట్టి పారేశారట అదేం లేదు కేవలం తన పెరఫార్మెన్సు ఎలా వుంది అనే విషయాన్ని ముఖ్యమంత్రి తన వర్గాల వారితో చర్చించారని అంటున్నారు, ఇటీవల ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ కేటీఆర్ కి పార్టీ లో ఉన్న పాపులారిటీ గురించి ఏమిటో చెప్పేసారు ,ఐతే తానూ ప్రస్తుతం మామ కేసీఆర్ అశీసులతో  ఎదిగానని లక్ష్మణ రేఖ దాటబోనని అన్నారు ..కెసిఆర్ తనకి ఎలాంటి ఆంక్షలు విధించ లేదని కేటీఆర్ తో కూడా ఎలాంటి పోర పొచ్చాలులేవని అన్నారు , భవిష్యత్తు లో కేటీఆర్ ని ముఖ్యమంత్రి ని చేసినా కెసిఆర్ ఆదేశాలను శిరసా వహిస్తా అని అన్నారు .భవిష్యత్తు లో వచ్చే మార్పులకు కాలమే సమాధానం చెప్పాలి . రాజకీయం లో ఏదైనా సాధ్యమే ..

]]>