'లేడీస్‌ టైలర్‌'మరో నవ్వుల జల్లు…..

అలనాటి మేటి చిత్రం రాజేంద్రప్రసాద్‌ హీరోగా నటించిన ‘లేడీస్‌ టైలర్‌’ అప్పట్లో విశేష ప్రజాదరణ పొందింది.దానికి సీక్వెల్ గా మధుర శ్రీధర్‌ రెడ్డి నిర్మాతగా,వంశీ దర్శకత్వం వహిస్తున్న,సుమంత్‌ అశ్విన్‌, అనీషా ఆంబ్రోస్‌, మనాలి రాథోడ్‌, మానస తదితరులు నటిస్తున్న’ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్‌ ఆఫ్‌ లేడీస్‌ టైలర్‌’:ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు వంశీ సినిమాల్లోని గోదావరి అందాలు, ఆ గోదావరి అందాలతో పోటీ పడే హీరోయిన్ల అందాలు, సంభాషణలు, సంగీతం, చిత్రీకరణ ఇలా అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. అలాంటి మేటి దర్శకుడు వంశీ దర్శకత్వంలో వచ్చిన అలనాటి మేటి చిత్రం ‘లేడీస్‌ టైలర్‌’ అప్పట్లో విశేష ప్రజాదరణ పొందింది.

ఆనాటి మేటి చిత్రం ‘లేడీస్‌ టైలర్‌’ స్థాయి ఏమాత్రం తగ్గకుండా, అంతకు మించి ప్రేక్షకుల్ని అలరించే కథ, కథనాలను రంగరించి, ‘ఫ్యాషన్‌ డిజైనర్‌ – సన్‌ ఆఫ్‌ లేడీస్‌ టైలర్‌’ పేరుతో ఈ సీక్వెల్‌ రూపొందుతోంది. అప్పటి లేడీస్ టైలర్ కొడుకు ఇప్పుడు ఏం చేస్తుంటాడు అనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం ఈ వేసవికి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

]]>