టాలీవుడ్ డీసెంట్ హీరోయిన్ ఎవరు అంటే ఆలోచించకుండా లావణ్య త్రిపాఠి అని చెప్పొచ్చు.తన సినిమాలన్నిటిలోనూ చూసినట్లయి తే ఓవర్ ఎక్స్పోజింగ్ చేసిన దాకలాలు ఎక్కడ కనిపించలేదు.అసలు ఎక్స్పోజింగ్ అంటే మూతి బిగించేస్తుందని మేకర్స్ చెబుతుంటారు. సినిమా కెరీర్ ఎలా ఉన్నా ఆ ఒక్క విషయంలో మాత్రం గీత దాటను, మాట తప్పననని మడి కట్టుకుని ఉంటుందన్న కoప్లేoట్ ఉంది.ఇప్పటివరకూ లావణ్య నటించిన సినిమాల్లో పెద్దగా గ్లామర్ ఒలికించింది లేదు. అయితే `రాధ` కోసం ఆ హద్దులన్నింటినీ చెరిపేసిందిట. పక్కా కమర్శియల్ సినిమాగా తెరకెక్కిన రాధ చిత్రంలో క్లైమాక్స్ లో హీరో శర్వానంద్ తో చేసిన రొమాంటిక్ సీన్స్ హైలైట్ గా ఉంటాయని మరీ పబ్లిక్ గా చెప్పింది లావణ్య అవి ఎలాంటి సీన్స్ అంటే మాత్రం తప్పించుకుంది.
శర్వాతో ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే రొమాన్స్ చేసిందిట.పెదవి ముద్దుల్లో అయితే హాలీవుడ్ బ్యూటీస్ రేంజులో రెచ్చిపోయిందిట.ఇది చిత్ర యూనిట్ చెప్పిన మాట.లావణ్య శర్వా గురించి మాట్లాడుతూ.., “ఆన్సెట్స్ లో శర్వా పెద్దగా ఎవరితో మాట్లాడడు.కానీ తనతో పనిచేస్తున్నంత సేపు చాలా హ్యాపీగా కంపర్టుబుల్ గా” ఉందని లావణ్య ఆకాశానికెత్తేసింది. అమ్మడు ఇప్పటివరకూ చాలా మంది యంగ్ హీరోలతో కలిసి నటించింది. కానీ ఎవరి గురించి ఏ సందర్భంలోనూ ఇలా మాట్లాడింది లేదు.మొదటి సారి శర్వా ని పొగిడింది.
]]>