అమ్మ కి గుడి కడుతున్న లారెన్స్

“గెలుపై సాగర,ఆ గెలుపే నీదిరా నీ రేపటి స్స్వప్నం మరువకు సోదర”అంటూ స్టైల్ మూవీ లో నే తన గెలుపు కి అమ్మ కొరికే కారణం అని చెప్పిన రాఘవ లారెన్స్ .రియల్ లైఫ్ లో తన అమ్మ కోసం గుడి కట్టిస్తున్నాడట.రాఘవ తల్లి కన్మణి ఎన్నో కష్టాలు ప‌డి త‌న‌ను ఇంత‌టి వాడిని చేసింద‌ని, ఆమె రుణం తీర్చుకోవడానికి, తల్లి గొప్పదనాన్ని లోకానికి చాటడానికి ఈ ప‌నిచేస్తున్నాన‌ని లారెన్స్ అన్నాడు. లారెన్స్‌ తన ఫేవ‌రేట్ గాడ్ రాఘవేంద్ర స్వామి గుడి ఎదురుగా తన తల్లి కి కూడా గుడి కట్టిస్తున్నాడట, నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్‌గా బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి అనిపించుకున్న రాఘ‌వ లారెన్స్ తల్లి జీవించి ఉండగానే ఇలా గుడి కట్టించి విగ్రహ ప్రతిష్ట చేస్తున్నాడు.లారెన్స్ కి తల్లంటే యెంత గౌరవమూ అర్ధమవుతుంది.

తన తల్లి కన్మణి కోసం ప్ర‌త్యేకంగా రాజ‌స్థాన్‌లో త‌యారు చేయించిన 5 అడుగుల పాలరాతి ప్రతిమను తాజాగా తెప్పించాడు. మార్చిలో త‌మిళ‌నాడులో నిర్వ‌హించే ఉగాది రోజున త‌న త‌ల్లి విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తాను అన్నాడు. అంతేకాదు, ఆమెపై ఓ పుస్త‌కం కూడా రాస్తాన‌ని చెబుతున్నాడు. రాఘవ లారెన్స్ లా కాకపోయినా ఇది చుసిన వాళ్లు కన్నవాళ్లకు పట్టెడు అన్నమైన పెడితే బావుంటుంది.

]]>