నా గురించి పూర్తిగా తెలుసుకోండి…సచిన్

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఫ్యాన్స్ కోట్లలోనే ఉన్నారు ప్రతి ఒక్కరికి ఆయన గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ఉంది వీరందరి కోసం సచిన్ జీవితకథ ఆధారంగా ‘సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్’ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీ ఈ నెల ప్రేక్షకుల ముందుకు రానుండగా, ప్రమోషన్‌లలో భాగంగా ఓ పాటను సచిన్ ఆవిష్కరించారు. “సచిన్ సచిన్” అంటూ మొదలయ్యే ఈ పాటకు సుఖ్విందర్ సంగీతం అందించాడు సో షల్‌ మీడియాలో ఈ పాట హల్‌చల్‌ చేస్తుంది.

తన గురించి చాలా విషయాలు తెలుసునని తన అభిమానులు అనుకుoటుఉంటారని,వారికి కూడా తెలియని ఎన్నో అంశాలు చాలా ఉన్నాయని అన్నారు సచిన్ టెండూల్కర్. “నా అభిమానులకు ఎన్నో తెలియని విషయాలున్నాయి. అందుకే జీవితకథ ద్వారా వారికి దగ్గర అవ్వాలనుకుంటున్నాను. ఈ మూవీ నన్ను కొత్తగా ఆవిష్కరిస్తుంది. నా జీవితంలోని ఎన్నో మధురస్మృతులను తెరపై చుసుకోబోతున్నాను అని ఏంతో ఆత్రుతగా అనందంగా ఉందంటున్నారు సచిన్.

 ]]>