బ్రహ్మ దేవుడు ఆలోచనలో పడ్డాడు తెలుసా.. నిజం(ఫన్నీ )స్టోరీ

చతుర్ముఖ బ్రహ్మ గారు కూడా ఆలోచనలో పడ్డాడు ..అంత  బిజీ లో కూడా అయన ఆలోచన లో పడటం అంటే మామూలు విషయం కాదు ..ఆయనకి కూడా వర్క్ స్ట్రెస్..ఉందేమో అనుకొంటున్నారా అదేం కాదు ఇది  చదవండి తెలుస్తుంది ..విషయం ఏమిటి అనేది 

ఒక  రోజు బ్రహ్మ ఆలోచనలో పడ్డాడు ప్రపంచాన్ని సృష్టించాను పసుపక్ష్యాదులను సృష్టించాను అయినా తృప్తిగా లేదెందుకని.. ఓ చిన్న ఆలోచన చేసి తనని తాను తిరిగి సృష్టించుకున్నాడు మనిషి అని నామకరణం చేశాడు అన్ని తెలివితేటలను, సకల సామర్థ్యాలనూ ఇచ్చాడు. ధైర్యం, సాహసం, నమ్మకం, ముందుచూపు, ఆత్మ విశ్వాసం నిండా నింపేశాడు. భూమి మీద వదిలేటప్పుడు బ్రహ్మకి భయం పట్టుకుంది. వీడు కాలాంతకుడు, ప్రాణాంతకుడు, దేవాంతకుడు అయిపోతాడేమో.. వీడి బలాన్ని మొత్తం వీడికి దక్కకుండా దాచేయాలి అనుకున్నాడు. “నేను దాన్ని ఆకాశంలో దాచేస్తాను. నాకివ్వు” అంది గద్ద. “మనిషి ఏదో ఒక రోజు ఆకాశాన్ని జయిస్తాడు. ఆ రోజు మళ్లీ తీసేసుకుంటాడు.” అన్నాడు బ్రహ్మ. “పోనీ … నేను నీటి అట్టడుగున దాచేస్తాను,” అంది చేప. “మనిషి ఏదో ఒక రోజు నీటిని జయిస్తాడు.” “నేను నేల పొరల్లో దాచేస్తాను.” అంది ఎలుక. “మనిషి నేలను చీల్చి మరీ సాధించేస్తాడు.” అప్పుడు ఒక కోతి నెమ్మదిగా ముందుకు వచ్చింది. “సర్వ శక్తులనీ మనిషి లోపలే దాచేద్దాం..” అంది. “భేష్…. మనిషి అన్ని చోట్లకు వెళ్తాడు. అన్నిటినీ గెలుస్తాడు. కానీ తన లోపలికి వెళ్లడు. తనను తాను గెలిచే ప్రయత్నమే చేయడు. అక్కడే దాచేద్దాం,” అన్నాడు బ్రహ్మ. అప్పటి నుంచి బలాన్ని మనిషి తనలోనే ఉంచుకుని.. బయట వెతుకుతూనే ఉన్నాడు. So search For OUR INNER POWER.. Every one is UNIQUE. 🙏నమ్మకం మించిన శక్తి లేదు శక్తి ఉంటే అపజయం లేదు🙏⁠⁠⁠⁠ source : ఈ కధ ను ఈమని పవన్ కుమార్ శర్మ, తాడేపల్లిగూడెం నుంచి  www.morning7am.com కి పంపించారు …]]>