ఆఫర్స్ చూసి వస్తువు కొంటె ఇలానే మోసపోతారు….

ఎక్కువ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్న బోర్డ్స్ చుస్తే చాలు ఆ వస్తువు నాణ్యత కూడా చూడకుండా తకువకోస్తుందని ఎగబడి కొనేస్తారు.అలంటి డిస్కౌంట్  సేల్ ఒకటి వెలుగులోకి వచ్చింది.14వేల మొబైల్ ను కేవలం రూ.499 కే ఇస్తామంటూ ఒక వాట్స్ యప్ మెసేజ్ వచ్చింది అది అమెజాన్ సైట్ ల కనిపించడం తో వెనక ముందు ఎం ఆలోచించకుండా ఒకరి నుంచి ఒకరికి ఆ మెసేజ్ షేర్ చేసుకోవడం ప్రతి ఒక్కరు ఆ మొబైల్ ఆర్డర్ ఇవ్వడం జరిగిపోయాయి.తక్కువ ధర ఉండటంతో అసలు అమేజాన్ లో ఆ మొబైల్ సేల్స్ ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకోలేదు. జియోమీ రెడ్ మీ నోట్ 4 ఫోను కేవలం ఫ్లిప్ కార్ట్ సంస్థనే విక్రయించాలనే ఒప్పందం చేసుకుందని తెలియని  అమాయుకులు అడ్డంగా బుక్ అయ్యారు.ఆ సైట్ లో ఇచ్చే కార్డు వివరాలను.. యూజర్ ఐడీ.. పాస్ వర్డ్.. అన్నింటినీ రహస్యంగా దొంగలిస్తూ సైబర్ క్రైమ్ కు పాల్పడుతోంది ఓ టీమ్. లింకు ఓపెన్ చేయగానే మొబైల్ ను హాక్ చేసి వివరాలు సేకరించి అకౌంట్ లో డబ్బులు దోచుకుంటున్నారు.వెనక ముందు ఆలోచించకుండా తక్కువ కి వస్తుందని ఆశ పడితే ఫూల్స్  అవ్వాల్సి  వస్తుందని ఇప్పటికైనా తెలుసుకోండి.

]]>