ఈ ధైర్య లక్ష్మి ఏం చేసిందో చుడండి….

వరకట్నం ఇప్పుడు ఆడపిల్లలను కుదిపెస్తున్న సమస్యా,పెంచి పెద్ద చేసి,విద్య బుద్దులు నేర్పించి ఎవరో ఇంటికి చాకిరీ చేయడానికి కట్నాలు ఇచ్చి మరి పంపిస్తున్నారు.వారికీ ఆ కట్నాలు చాలక మహిళలను వేదిపులకు గురి చేస్తున్నారు.ఒక ప్రబుద్దుడు ఏకంగా పెళ్లి పీటల మీదే వేదింపులు మొదలు పెట్టాడు,అతనికి సరైన బుద్ది చెప్పింది ఈ పెళ్లి కూతురు.వివరాలలోకి వెళ్తే….

ఉత్తర భారతంలో ముంతాజ్ అన్సారీ అనే వరుడి ఆశలకు హద్దులు లేకుండా పోయాయి.వరుడు అన్సారీ ఆటో నడుపుతుంటాడు. కోరినవన్నీ అతనికి సమర్పించాడు వధువు తండ్రి బషీరుద్దీన్. బైక్ కానుకగా ఇవ్వమన్నా కూడా ఒప్పుకున్నారు.అయిన పెళ్లి పీటలపైనే,కట్నం కోసం హంగామా చేశాడు.బైక్ మోడల్ మారిందంటూ గొడవ చేసాడు.పెద్దలు ఎంత చెప్పిన వినట్లేదు.ఎలాగో బ్రతిమాలి పెళ్లి చేసారు పెద్దలు.అయినప్పటికి అన్సారీ కట్నం అడగడం ఆపట్లేదు.ఇచ్చిన దానితో సర్దుకోమంటే సీరియస్ అయ్యాడు. ఓపిక నశించిన పెళ్లి కూతురు లోకల్ క్వాజీ కి కబురు పెట్టింది. వాళ్లు వచ్చిన వెంటనే కుటుంబ సభ్యుల సహకారంతో అక్కడికక్కడే విడాకులు ఇచ్చేసింది.తర్వాత వరుడు ముంతాజ్ అన్సారీకి గుండు కొట్టిచ్చి.. చెప్పులతో దండ వేసి.. ఊరంతా ఊరేగించింది.అంతేకాదు పెళ్లి కొడుకుకు గుడ్ బై చెప్పే అప్పటిప్పుడు మరో పెళ్లి చేసుకుంది.కట్నం కోసం వేధించుకు తినేవాళ్లకు ఇది కరెక్ట్ సమాధానమంటున్నారు జనం.

   ]]>