లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎమ్మెల్యే…లవ్ స్టొరీ

లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఓ యంగ్ ఎమ్మెల్యే.. సబ్ కలెక్టర్ ను ప్రేమించాడు. ఇద్దరూ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. కేరళ రాష్ట్రంలో జరిగిన ఈ రియల్ లవ్ స్టోరీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. కేరళలోని అరువిక్కర నియోజకవర్గంకు శబరినాథన్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఎమ్మెల్యే అదే రాష్ట్రానికి చెందిన IAS అధికారి, తిరువనంతపురం సబ్ కలెక్టర్  దివ్యనాయర్ ను పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే స్వయంగా పోస్ట్ ద్వారా వెల్లడించారు.

తిరువనంతపురంలో 2016లో ఓ ఫంక్షన్ లో ఫస్ట్ టైం సబ్ కలెక్టర్ దివ్యను కలిశారు ఎమ్మెల్యే. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లు మొదటి చూపులోనే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టిందన్నారు శబరినాథన్. తన మనసులోని మాటను సబ్ కలెక్టర్ కు చెప్పారు ఎమ్మెల్యే. ఇద్దరి ఆలోచనలు, మనసులు కలవటంతో ఒక అవగాహనకు వచ్చారు. ఆరు నెలల ప్రేమ తర్వాత.. పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు ఈ జంట. రెండు కుటుంబాలు ఓకే కూడా చెప్పాయి. 2017 జూన్ నెల చివరిలోనే వివాహం జరగనున్నట్లు వెల్లడించారు.

 ]]>