`లక్ష్మీబాంబ్` మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్‌పాత్రలో గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘లక్ష్మీబాంబ్`ఫిబ్రవరి ౨౪ మహాశివరాత్రి రోజున రిలీజ్ చేస్తున్నారు.
చిత్ర సమర్పకుడు గునపాటి సురేష్ రెడ్డి మాట్లాడుతూ ”పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో, మంచి ఎమోషన్స్ తో లక్ష్మీ బాంబ్ సినిమాను రూపొందించాం. అనుకున్న ప్లానింగ్ లో సినిమా పూర్తయ్యింది. మంచు లక్ష్మీగారిని చాలా కొత్త రకంగా ప్రజెంట్ చేసే సినిమా. సునీల్ కశ్యప్ సంగీతంలో విడుదలైన పాటలు, థియేట్రికల్ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ అన్నారు .
ఈ చిత్రం లో పోసానికృష్ణ మురళి, హేమ, ప్రభాకర్, భరత్‌రెడ్డి, జీవా, అమిత్, హేమంత్, రాకేష్, సుబ్బరాయశర్మ, జె.వి.ఆర్, రాజాబాబు, శరత్, శ్రీహర్ష, విశాల్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కథ, మాటలు: డార్లింగ్ స్వామి, లైన్ ప్రొడ్యూసర్: సుబ్బారావు, ఆర్.సురేంద్రరాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.మురళి, నిర్మాతలు: వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమా లక్ష్మీ నరసింహ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కార్తికేయ గోపాలకృష్ణ.
]]>