వేసవి అంటే మామిడిపండు,ఇది మామిడి పండ్ల సీజన్ కావడంతో విరివిగా లభిస్తాయి.పసుపు రంగులో చూడగానే తినాలనిపించే ఈ పండ్లు నిజంగానే బంగారమంటున్నారు పరిశోధకులు.అలాంటి మామిడి పండును తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.మామిడి పండులో క్యాలరీల శక్తి, ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, చక్కెర, పీచు పదార్థం ఇలా అనేక పుష్కలమైన పోషకాలు ఉంటాయి.
మామిడి పండు రుచికే కాదు ఆరోగ్యానికి మేలు….
మామిడి పండును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.మామిడిలో పీచు పదార్థం ఎక్కువ కాబట్టి మలబద్ధకానికి నివారిస్తుంది.పెద్ద పేగుకు క్యాన్సర్ వచ్చే అవకాశాలను మామిడి సమర్థంగా నివారిస్తుంది. కంటిచూపును మెరుగుపరిచేందుకు అవసరమైన బీటా–కెరొటిన్ ఈ పండు లో పుష్కలంగా ఉంటుంది.
మామిడిలో ఉండే పొటాషియమ్ కారణంగా అది గుండెజబ్బులనూ(కార్డియో వాస్క్యులార్ డిసీజెస్), రక్తపోటునూ నివారిస్తుంది.మామిడిలోని బీటా కెరొటిన్ పోషకమే ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము, లుకేమియా వంటి అనేక క్యాన్సర్ల నివారణకూ తోడ్పడుతుంది.
]]>