‘మన్మధుడు2’ రొమాంటిక్ సినిమా అట?

Manmadhudu2
Manmadhudu2

అన్నపూర్ణ స్టూడియోస్, వయాకామ్ 18 మూవీస్, ఆనంది ఆర్ట్స్ సంస్థలు  సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘మన్మధుడు2’. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు  నాగార్జున – రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లు. సినిమా అప్పట్లో వచ్చిన ‘మన్మథుడు’ రేంజ్ ని అందుకోగలదా అని అభిమానుల్లో ఆసక్తి నెలకొని వుంది. ‘మన్మథుడు’ సినిమాలో త్రివిక్రమ్ కామెడీని  టైమింగ్ లో పండించారు. అయితే ‘మన్మథుడు’లో ఉన్నట్టే ‘మన్మథుడు 2’ లో కూడా నాగార్జున పాత్ర ఫుల్  గా నవరసాలను పలికిస్తున్నాడని చిత్రవర్గాల్లో టాక్. మరో వివిషయం ఏమిటంటే రొమాంటిక్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయట.  రాహుల్ రవీంద్రన్ కామెడీతో కంటే, రొమాన్స్ నే ఎక్కువుగా నమ్ముకున్నాడు అనుకొంటున్నారు.  ఈ సినిమాలో సమంత, కీర్తి సురేష్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగష్టు 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురాబోతోంది.