రోబో ని పెళ్లి చేసుకున్న చైనా ఇంజనీర్‌…

 చైనా లో అమ్మాయిలు దొరకట్లేదు అని ఇతర దేశాలనుంచి కూడా ఎదురు కట్నం ఇచ్చి మరి పెళ్లి చేసుకుంటున్నారు.చైనా లో ని 31 ఏళ్ల జెంగ్‌ జియాజియా కి కూడా పాపం పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరక్క ఇంట్లో పెళ్లి చేసుకోమంటూ పెద్ద వాళ్ళు పెట్టె పోరు తట్టు కోలేక తనే లేడీ రోబో ని తాయారు చేసుకొని పెళ్లి చేసుకున్నాడు.

 ఉద్యోగం,డబ్బు,అన్నీ ఉన్నా పెళ్లి చేసుకుందాం అంటే ఏ ఒక్కరూ పిల్లని ఇవ్వటం లేదు.అంతే విసిగిపోయిన జెంగ్‌ జియాజియా రోబోని పెళ్లి చేసుకున్నాడు.చైనాలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు.ఏడాది కిందట తానే రోబోను తయారు చేసాడు. జెంగ్‌ రెండు నెలలపాటు ఈ రోబోతో డేటింగ్‌ చేస్తూ ఇంజియింగ్‌ అని ముద్దుగా పిలుచుకునేవాడట.తనకి రోబో నచ్చడం తో ఈ మరమనిషినే పెళ్లి చేనుకున్నాడు.

చైనా సంప్రదాయంలో బంధువులను, మిత్రుల సమక్షం లో గత నెల మార్చి31న ఘనంగా వివాహం చేసుకున్నాడు. పెళ్లి రిజిస్టర్‌ చేయడానికి మాత్రం రిజిస్టార్‌ కార్యాలయంలో కుదరదని చెప్పేశారు. అయితే తన భార్యకు చైనా భాషలో మాట్లాడేందుకు కొన్ని మాటలు కూడా నేర్పించాడట జెంగ్‌.తాను ఉన్నా లేకపోయినా అన్ని ఇంటి పనులు తనంతట తనే చేసుకునేలా ఇంజియింగ్‌ను తయారు చేసినట్లు జెంగ్‌ తెలిపారు.రానున్న రోజుల్లో పెళ్లిళ్లు ఎంత వింతగా జరగనున్నాయో చెప్పడానికి ఈ సంఘటననే ఉదాహరణగా తీసుకోవచ్చు.ప్రస్తుతం 114 మంది మగవాళ్లకు వంద మంది అమ్మాయిలే ఉన్నారని రిపోర్ట్ లు తెలియజేస్తున్నాయి. చైనాలో ఏక సంతాన విధానమె ఈ సమస్య కి కారణం అంటున్నారు.

]]>