మెగాస్టార్ చిరంజీవి- అక్కినేని అఖిల్ ఒకే స్టేజ్ మీద కలిస్తే.ఇరువురి ఫ్యాన్స్‌కి చూడడానికి రెండు కళ్ళు చాలవు.ఇంకా అఖిల్ ఫ్యాన్స్ ఐతే మరీ…. ఇటీవలే మెగా-అక్కినేని అభిమానులకు ఆ ఛాన్స్ దక్కింది. అక్కినేని అఖిల్ `మీలో ఎవరు కోటీశ్వరుడు?` షోలో పాల్గొన్నారు. అంతేకాదు ఆ వేదికపై మెగాస్టార్‌తో ఓ సెల్ఫీ కూడా దిగాడు. ఈ షోలో పాల్గొన్న తర్వాత కోటీశ్వరుడు షో లో మెగాస్టార్ తో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. మెగాస్టార్‌తో తన సెల్ఫీని సోషల్ మీడియా లో షేర్ చేశాడు అఖిల్.ఇదే సంద్భంలో మెగాస్టార్ చేసిన ఓ సాయాన్ని కూడా అఖిల్ ప్రస్థావించాడు. తన తల్లి అమల సారథ్యంలోని `బ్లూ క్రాస్`కి మెగాస్టార్ చిరంజీవి తనవంతుగా కొంతమేర ఆర్థిక సాయాన్ని చేసారని అఖిల్ వెల్లడించారు. మెగాస్టార్ సాయానికి కృతజ్ఞతలు తెలిపాడు.
]]>