మెగాస్టార్ చేతుల మీదుగా ఇది మా ప్రేమ కథ మోషన్ పోస్టర్ విడుదల

యాంకర్ రవి హీరోగా పరిచమవుతూ నటిస్తున్న చిత్రం “ఇది మా ప్రేమ కథ”. రవి సరసన “శశిరేఖా పరిణయం” సీరియల్ ఫేమ్ మేఘన లోకేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మత్స్య క్రియేషన్స్-పి.ఎల్.కె ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.అయోధ్య కార్తీక్ దర్శకుడిగా పరిచయమవుతుండగా.. కార్తీక్ కొడకండ్ల మ్యూజిక్ అందిస్తున్నారు . ప్రముఖ దర్శకులు పూరీ జగన్నాధ్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు విశేషమైన స్పందన లభించింది. ఇప్పుడు ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఈ చిత్రానికి పబ్లిసిటీ డిజైన్స్: రమేష్ కొత్తపల్లి, పాటలు: దినేష్ (నాని), సినిమాటోగ్రఫీ: మోహన్ రెడ్డి, సహనిర్మాత: పి.ఎల్.కె.రెడ్డి, సంగీతం: కార్తీక్ కొడకండ్ల, నిర్మాణం: మత్స్య  క్రియేషన్స్, దర్శకత్వం: అయోధ్య కార్తీక్!!..

[embed]https://www.youtube.com/watch?v=vckUrf4ebbI[/embed] edii
]]>