ఇకపై బ్యాంకు సేవలు..ప్రియం ..చార్జీల వాతలు మోతలు

ఇంతవరకు ఫ్రీగా సేవలు అందించిన బ్యాంకులు… ఇప్పుడు ఛార్జీల మోత మోగించనున్నాయి. రూపాయి తీస్తే ఛార్జ్… రూపాయి వేస్తే ఛార్జ్ అన్నట్టు ఏప్రిల్‌ నుంచి బ్యాంకులు అందించే సేవలు భారం అవ్వనున్నాయి. అంతేకాదు బ్యాలెన్స్ జీరో అయితే..  జేబు గుల్ల అయినట్టే. మినిమం బ్యాలెన్స్ కచ్చితంగా మెయింటేన్ చేయాల్సిందే.కొత్త ప్రతిపాదనలు రూపొందించుకున్న బ్యాంకులు.. వాటిని ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి తేనున్నాయి. SBIతో పాటు ICICI, HDFC, AXIS లాంటి ప్రైవేట్ బ్యాంకులు బాదుడుకి రెడీ అయ్యాయి.

SBI ఇలా  నెలకు మూడు సార్లు ఖాతాలో డబ్బును ఉచితంగా డిపాజిట్‌ చేయొచ్చు. ఆతర్వాత.. ప్రతి జమకు రూ. 50 చెల్లించాల్సిందే. మెట్రో సిటీలలో కనీస నిల్వ రూ. 5 వేలు నగర ప్రాంతాల్లో అయితే.. రూ. 3 వేలు, పట్టణాల్లో.. రూ. 2 వేలు పల్లెల్లో అయితే రూ. వెయ్యి ఉండాలి ఈ ప్రకారం లేకుంటే.. రూ. 200 చెల్లించాలి. అదనంగా ఎన్ని రోజులు నిల్వ లేదో, ఆమేరకు సర్‌ఛార్జి విధిస్తారు. SBI ఏటీయం వివరాలు  ఇలా ఉన్నాయి: SBI ఏటీఎంను 5 సార్లు ఉచితంగా ఉపయోగించవచ్చు. ఆ తర్వాత ప్రతి లావాదేవీకి రూ. పది చొప్పున వసూలు చేస్తారు. ఇతర బ్యాంకు ఏటీఎం అయితే ఉచితంగా 3 సార్లు వినియోగించుకోవచ్చు. పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి రూ.20 వసూలు చేస్తారు. ఇలా చేస్తే బాదుడు తప్పించుకోవచ్చు… బ్యాంకుల సేవలు కనుక భారంగా మారితే.. రుసుముల బాదుడు నుంచి తప్పించుకోవచ్చని బ్యాంకింగ్‌ నిపుణులు సూచిస్తున్నారు. సర్వీస్ ఛార్జెస్ ఎక్కువగా ఉన్నాయని భావిస్తే.. ఆ అకౌంట్ ను క్లోజ్ చేసుకోవచ్చని చెబుతున్నారు. పోస్టల్ సేవింగ్స్ బెటర్ 

దీనికి బదులు పోస్టల్‌లో సేవింగ్ అకౌంట్ ను రూ.50లతో ఓపెన్ చేసుకోవచ్చని అంటున్నారు. దీనికి ఏటీఎం కార్డు కూడా ఇస్తున్నారని చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఏటీఎంలు కూడా వస్తున్నాయి. వీటి నుంచి డబ్బును డ్రా చేసుకోవచ్చు. ‌బ్యాలెన్స్ ఎంక్వైరీకి ఏటీఎంను ఉపయోగించుకోవలసిన అవసరం లేకుండా… మిస్డ్‌కాల్‌ బ్యాంకింగ్‌ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తెలుపుతున్నారు. ఈ మిస్డ్ కాల్ తో మెసేజ్ చెక్ చేసుకోనే అవకాశం కూడా వుంది .

ప్రజల్లో అసహనం !

బ్యాంకుల బాదుడుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు  ఇదెక్కడి బాదుడు అంటూ…. ఫైర్ అవుతున్నారు. బ్యాంకుల తీరును ఖండిస్తూ… ఈ నిర్ణయాలకు వ్యతిరేకంగా అందరూ ఒక్కటవుతున్నారు. ప్రాంతాలతో తేడా లేకుండా ఒకరి అభిప్రాయాలను మరొకరితో పంచుకుంటున్నారు.. సామాజిక మాధ్యమాల వేదికగా ఈనెల 31న ఖాతాల నుంచి డబ్బును డ్రా చేయడంతోపాటు, ఏప్రిల్‌ 6న ఎటువంటి లావాదేవీలు నిర్వహించకూడదని సోషల్ మీడియా లో పోస్ట్లు  హల్ చల్ చేస్తున్నాయి .

]]>