సస్పెండ్ అయిన టిడిపి ఎమ్మెల్యేలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.తోలి రోజే ఇద్దరు ఎమ్మెల్యేల ను స్పీకర్ సస్పెండ్ చేసారు.ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్న సమయం లో ఆయన ను అడ్డుకున్నారని ఆరోపిస్తూ, తెలుగుదేశం ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్రలను స్పీకర్ మధుసూదనాచారి సస్పెండ్ చేశారు.బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకూ వారిని సస్పెండ్ చేస్తున్నట్టు ఈ ఉదయం అసెంబ్లీలో స్పీకర్ ప్రకటించారు.కాంగ్రెస్ సభ్యులు సైతం నిరసన తెలిపి వాకౌట్ చేసినప్పటికీ, వారిపై ఎటువంటి వేటు పడకపోవడం కేవలం టిడిపి ఎమ్మెల్యేల ను మాత్రమే సస్పెండ్ చేయడం చేర్చినీయాంశం గా మారింది.

]]>