'కుర్రతుఫాన్‌' లో మాజీ ఎమ్మెల్యే

సిక్స్‌ఫ్రెండ్స్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌లో మాస్టర్‌ శ్రీరామచంద్ర గొర్రెపాటి సమర్పణలో దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, పి.సి. రెడ్డిల శిష్యుడు డా|| క్రిష్ణమోహన్‌ గొర్రెపాటి దర్శకుడిగా పరిచయం అవుతూ..తెరకెక్కిస్తున్న చిత్రం ‘కుర్రతుఫాన్‌’. ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ మార్చి 3వ తేదీ నుండి మొదలైంది.

ఈ సందర్భంగా దర్శకుడు డా|| క్రిష్ణమోహన్‌ గొర్రెపాటి మాట్లాడుతూ.. ప్రస్తుతం కార్పోరేట్‌ కాలేజీల్లో విద్యార్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, వాళ్ళకు అండగా ఉండే పాత్రలో విద్యాశాఖ మంత్రిగా.”షాద్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌ రెడ్డి” గారు ఈ చిత్రంలో నటిస్తున్నారు.ఆయనకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.

ఆర్‌.ఎస్‌. నంద చేసే కామెడీతో థియేటర్‌లోని ప్రేక్షకులను అలరించనున్నాడు. సైంటిఫిక్‌ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతున్నసినిమాని .ఈ సమ్మర్‌కి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము.అన్నారు.

విద్యాశాఖ మంత్రిగా నటిస్తున్న ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.నేను నా నియోజక వర్గ ప్రజలకు అండగా ఉన్నట్లే..ఈ సినిమా విషయంలో అండగా ఉంటాను అన్నారు.

కావ్య, వీరేందర్‌, హరి, ఆర్‌.ఎస్‌.నంద, బ్రహ్మానందం, ఆలీ, రాజీవ్‌ కనకాల, ఉత్తేజ్‌ మరియు నూతన నటీనటులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: గోపాల్‌ సామ్రాజ్‌, సంగీతం: టి.పి. భరద్వాజ్‌, పాటలు: చంద్రబోస్‌, నిర్మాణం: సిక్స్‌ఫ్రెండ్స్‌ యూనిట్‌, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: డా|| క్రిష్ణమోహన్‌ గొర్రెపాటి

]]>