మాయరోగానికి మోడీ కాయకల్ప

గతి తప్పుతున్న భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి అభివృద్ధి దిశగా నడిపించేందుకు గత రెండున్నరేళ్లుగా మోదీ ప్రభుత్వం చేస్తున్న భగీరథ ప్రయత్నం సత్ఫలితాలనిస్తోంది. విశృంఖలంగా పెరిగిపోతున్న అవినీతి, లెక్కకు అందని నల్లధనం, దేశ సరిహద్దులు దాటి విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న జాతి సంపద, బ్యాంకింగ్ వ్యవస్థకు పోటీగా హవాలా వ్యాపారం, జాతి జీవనాడిని నిర్వీర్యం చేసే మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పెట్టుబడులు, దేశ సార్వభౌమత్వాన్ని సవాల్ చేసే తీవ్రవాద సంస్థలకు భారీగా విరాళాలు, ఆర్థిక వ్యవస్థను బలహీనపరచే దుష్టబుద్ధితో పొరుగున ఉన్న శత్రుదేశాలు చెలామణీలోకి తెచ్చిన దొంగనోట్లు తదితర కారణాలతో దేశ ఆర్థికవ్యవస్థ రోజురోజుకూ బలహీనపడడం తెలిసిందే.

modii

రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారుల కుమ్మక్కుతో సమాంతర ఆర్థికవ్యవస్థ అసలు వ్యవస్థను దాటిపోయింది. బ్యాంకుల్లో, ప్రభుత్వ ఖజానాల్లో ఉన్న డబ్బుకంటే అధిక రెట్లు డబ్బు సంపన్నుల బీరువాల్లో, పరుపుల కింద, బాత్రూముల్లో, గోడల్లో నిక్షిప్తమైపోయింది.ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో బాధ్యతలు స్వీకరించిన మోదీ ప్రభుత్వం తొలిరోజు నుంచే అవినీతి, నల్లధనంపై యుద్ధం ప్రకటించింది.

currency

26 మే 2014న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ ఆ మరునాడే 27 మే 2014న నల్లధనం వెలికితీతపై ‘ప్రత్యేక నిఘా బృందం’ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. పన్నులు ఎగ్గొట్టి- ఆ డబ్బును విదేశాల్లో దాచిపెట్టడం కొంతమంది వ్యక్తులకు, సంస్థలకు పరిపాటైంది. మరోవైపు అధికార యంథ్రాంగం కనుసన్నల్లో అవినీతి పెచ్చరిల్లింది. 2009లో ప్రముఖ న్యాయవాది, మాజీ కేంద్రమంత్రి రాం జెఠ్మలానీ ఆధ్వర్యంలో పలువురు ప్రముఖ న్యాయవాదులు సుప్రీం కోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేస్తూ విదేశీ బ్యాంకుల్లో, స్వదేశంలో పేరుకున్న నల్లధనాన్ని వెలికితీసేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వవల్సిందిగా కోరారు.

supreme court

భవిష్యత్తులో నల్లధనం ఉత్పత్తి జరగకుండా ఉండేలా తగిన మార్గదర్శకాలు జారీచేయాలని కోరారు. 4 జూలై 2011న సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేస్తూ నల్లధనం వెలికితీతకై ‘స్పెషల్ ఇనె్వస్టిగేషన్ టీం’ (సిట్)ను నియమించమని అప్పటి మన్మోహన్‌సింగ్ ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీచేసింది. నాలుగేళ్లు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం ‘సిట్’ను నియమించకపోయినా, అధికారంలోకి వచ్చిన మర్నాడే మోదీ ప్రభుత్వం ఆ పనిని నెరవేర్చింది. దీంతో అవినీతి, నల్లధనంపై అధికారిక పోరు ప్రారంభమైంది. కాంగ్రెస్ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కార్యాలయం సాక్షిగా కొనసాగిన లక్షల కోట్ల రూపాయల బొగ్గు గనుల పంపిణీ కుంభకోణానికి స్వస్తిపలుకుతూ మోదీ ప్రభుత్వం 14 ఫిబ్రవరి 2015న బొగ్గు గనులను బహిరంగ వేలం వేయాలని నిర్ణయించడం అవినీతి నిరోధక చర్యల్లో మరొక కీలక ఘట్టం.

coal mines

2004-2009 మధ్యకాలంలో అత్యంత విలువైన బొగ్గు గనులను అడ్డగోలుగా కాంగ్రెస్ పార్టీ తన అస్మదీయులకు ఇచ్చేసింది. దీంతో ప్రభుత్వానికి దాదాపు లక్షా 80వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలో పేర్కొన్నది. భాజపా దాఖలు చేసిన పిటిషన్‌తో సిబిఐ జరిపిన విచారణలో అనేక ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఊరూ పేరూ లేని కంపెనీలకు సైతం బొగ్గు గనులు ఇచ్చేశారు. ఆగస్టు 2014లో సుప్రీం కోర్టు 214 బొగ్గు గనుల పంపిణీని ఒకే ఆదేశంతో రద్దుచేసింది. మోదీ ప్రభుత్వం కొన్ని గనులను బహిరంగ వేలం వేయడం వల్ల ఇప్పటికే అయిదు లక్షల కోట్ల రూపాయల ఆదాయం లభించింది.

marishas 11 మే 2016న మారిషష్ ప్రభుత్వంతో మోదీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం కారణంగా నల్లధనాన్ని విదేశీ పెట్టుబడుల రూపంలో ‘చట్టబద్ధమైన డబ్బు’గా మార్చే ప్రక్రియ ఆగిపోయింది. కొన్ని విదేశీ కంపెనీలు మారితోష్ ద్వారా భారత్‌లో పెట్టుబడులు పెడుతూంటాయి. మన దేశం దాటిపోయిన మన డబ్బే తిరిగి విదేశీ పెట్టుబడుల రూపంలో తిరిగి దర్జాగా దేశంలోకి వస్తూండేది. దాదాపు 35 శాతం నల్లధనం ఇలా తిరిగి మన మార్కెట్‌లోకి ప్రవేశించేది. మోదీ ప్రభుత్వం చూపిన చొరవ, మారిషష్‌తో ఒప్పందం కారణంగా మూడు దశాబ్దాలపాటు అమలులో ఉన్న ఇండో-మారిషస్ డబుల్ టాక్సేషన్ అనాయిడెన్స్ అగ్రిమెంట్ (డిటిఎఎ) రద్దు అయింది. ఈ ఒప్పందాన్ని రద్దుచేయించడానికి గత ప్రభుత్వాలు సాహసించలేకపోయాయి.

ఈ ఒప్పందాన్ని అడ్డం పెట్టుకుని హవాలా రూపంలో 2001-2011ల మధ్య 39 శాతం విదేశీ పెట్టుబడులు భారత్ చేరాయి. అతి చిన్న దేశమైన మారిషష్ ఇన్ని లక్షల కోట్ల రూపాయలను ఎలా పెట్టుబడి పెడుతున్నదన్న అనుమానం గత పాలకులకు ఎందుకు కలగలేదన్నది భేతాళ ప్రశ్న. మారిషష్‌లో ప్రతి ఇంట్లో ఒక కార్పొరేట్ కంపెనీ ఉంటుంది. ఇంటికో లాయర్ ఉంటాడు. బొంబాయి స్టాక్ ఎక్స్ఛ్‌ంజీని నిర్దేశించగలిగే దమ్ము ఒకప్పుడు మారిషష్‌కు ఉండేది. మోదీ ప్రభుత్వ చర్యతో హవాలా అవినీతి బాగోతం ఆగిపోయింది.

stockmarket

భారత ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించే చర్యల్లో 5 సెప్టెంబర్ 2016న జి-20 వేదికపై మోదీ చేసిన ప్రకటన అత్యంత కీలకం. ఐరోపా ఖండంలోని వివిధ దేశాలతోపాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోని ‘టాక్స్ హెవెన్స్’ను అంతమొందించాలంటూ మోదీ సంచలనాత్మక ప్రకటన చేశారు. ప్రపంచవ్యాప్తంగా అవినీతిని నిర్మూలించాలంటే ‘టాక్స్ హెవెన్స్’ రద్దుతో పాటు ఆర్థిక నేరస్థులకు కఠిన శిక్షలు వేయాలని, బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకత పెంచాలంటూ మోదీ చేసిన ప్రకటనకు ప్రపంచ దేశాలు సానుకూలంగా స్పందించాయి.దృఢమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అవినీతిని నిరోధంచడం, పన్నుల ఎగవేతను అరికట్టడం, నల్లధనాన్ని వెలికి తీయడం అత్యవసరం అని మన ప్రధాని చేసిన ప్రకటనతో జి-20 దేశాలు అంగీకరించాయి. అవినీతి,నల్లధనంతోపాటు తీవ్రవాద సంస్థలకు విరాళాలు అందకుండా చర్యలు తీసుకుంటామని ప్రతిజ్ఞ చేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వాలు కలలో కూడా సాహసించని పనులను మోదీ ప్రభుత్వం అలవోకగా చేసేసింది. గత 18 ఏళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల ఫైళ్ళ మధ్య నలిగిపోతున్న ‘బినామీ వ్యవహారాల సవరణ చట్టా’న్ని ఆమోదింపచేసి గెజిట్‌లో ప్రకటించింది. ఈ చట్టాన్ని 18 ఏళ్ల క్రితం తీసుకువచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వాలు నోటిఫై చేయలేదు.⁠⁠⁠⁠

]]>