దుష్టులకు దూరంగా ఉండాలి ఎందుకో తెలుసా ?

కొన్ని కొన్ని అనుభవం లోకి వస్తే మినహా ఎంత చెప్పినా అర్ధం కావు …అనుభవం వచ్చేవరకు వేచి చూసేకంటే యుక్తి తో ముందుగా మేలుకొలిపేందుకే నీతి కధలు, బాల సాహిత్యం  మిత్రం లాభం,మిత్రం భేదం పంచతంత్రం వంటివి ఈ తరం పిల్లలకి కనీసం ఇటువంటి కధలు చెప్పే వారు చదివించే వారు కరువు ఐపోతున్నారు ఫలితంగా కనీస  నేర్చుకో లేక పోతున్నారు ..నా  వంతుగా ఇటువంటి నీతి కధల్ని పోస్ట్ చేయడం ద్వారా కొంత అయినా ఉపయోగం ఉంటుంది అనేది నా ప్రయత్నం…నా అభిప్రాయం నచ్చితే సైట్ ఫేస్బుక్ పేజీ కి లైక్  ఇవ్వ గలరు …

అనగనగా ఒక తోడేలు ఆకలి మీద గబా గబా తింటుంటే ఒక ఎముక గొంతులో గుచ్చుకుంది.నొప్పి తో విలవిలలాడి పోయింది. గొంతులో ఏదైనా ఇరుక్కుంటే మనం దాని గురించి తప్ప ఇంకేమి ఆలోచించ లేము. అలాగే తోడేలు కూడా ఆ ఎముకను మింగలేక, కక్క లేక, బాగా బాధ పడింది.కొంగను వె తుక్కుంటూ వెళ్ళింది. “నా గొంతులో ఒక ఎముక గుచ్చుకుంది. అది తీసి పెడితే నేను నీకు ఒక బహుమతి ఇస్తాను” అని ప్రమాణం చేసింది.కొంగ బహుమానం మాట విని, ఆశ పడి, తన తల తోడేలు నోట్లో పెట్టి, పొడుగు పక్షి ముక్కుతో ఎముకని బైటికి లాగింది.ఎముక బైట పడగానే తోడేలు వెళ్ళిపోవడం మొదలెట్టింది.కొంగ తోడేలుని పిలిచి, “మరి నా బహుమానం యేది?” అని అడిగింది.“నీ తల నా నోట్లో పెట్టి దాన్ని నేను కోరికేయకుండా నిన్ను మళ్ళి బయటికి తీసుకోనిచ్చాను. అదే నీ బహుమానం.” అని తోడేలు తుర్రుమంది.దుష్టులకి ఎవరైనా ఉపకారం చేసినా కృతజ్ఞత వుండదు…ఉపకారం చేసినా దుష్టులకి దూరంగా ఉండటమే మంచిది ..అనేది నీతి .

]]>