అతను కవిత ను ఆలా చేసాడట

సీనియర్ సినీ నటి, టీడీపీ నేత కవిత,ఎస్‌.వీ.ఎన్‌.రావు పై హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నాడంటూ గతంలో ప్రొడక్షన్‌ మేనేజర్‌ గా పని చేసిన ఎస్‌.వీ.ఎన్‌.రావు రాష్ట్ర విభజన అనంతరం బంజారా హిల్స్‌ రోడ్‌ నెం. 2లోని నవోదయ కాలనీలో నవ్యాంధ్రప్రదేశ్‌ ఫిలించాంబర్‌ పేరిట కార్యాలయం తెరిచాడు.తనకు తెలియకుండానే వైస్ ప్రెసిడెంట్ గా  తనని నియమించాడoటు కవిత ఆరోపిస్తున్నారు.సంస్థలో సభ్యత్వం పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నాడు.
ఆ సంస్థ కి ఎలాంటి హక్కులు లేవని తెలియడంతో రాజీనామా చేశాను.రాజీనామా ని వెనక్కి తీసుకోవాలని,సీఎం చంద్రబాబు, కేంద్రమంతులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయతో తన పరిచయాన్ని ఉపయోగించి ఫిల్మ్ ఛాంబర్ హక్కులు కల్పించేలా చేయాలనీ విపరీతం గా ఒత్తిడికి గురి చేస్తున్నాడు,అందుకు తాను ఒప్పుకోకపోవడం తో గత మూడు రోజులుగా ఫేస్ బుక్ లో తనపై దుష్ప్రచారం చేస్తున్నాడని ఆమె చెప్పారు.కారు డిమాండ్ చేశానని ప్రచారం చేస్తున్నాడని, తన పరువుకు నష్టం కలిగించారని కావిత పిర్యాదులో పేర్కొన్నారు.వెంటనే విచారణ జరిపించాలని కోరినట్టు కవిత చెప్తోంది
]]>