యువసామ్రాట్‌ న్యూ మూవీ ఇదే……

చాల గ్యాప్ తర్వాత అక్కినేని వారసుడు యువసామ్రాట్‌ నాగచైతన్య కొత్త సినిమాతో ప్రేక్షకులముందుకు రానున్నాడు.శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై నాగచైతన్య హీరోగా కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి ఉగాది పండగ రోజున ‘రారండోయ్‌.. వేడుక చూద్దాం’ టైటిల్‌ని ఫిక్స్‌ చేసినట్టు అనౌన్స్‌ చేశారు. ఈ సందర్భంగా ఈచిత్రానికి సంబంధించి రెండు పోస్టర్స్‌ను ఫస్ట్‌ లుక్‌గా విడుదల చేశారు. నాగచైతన్య కెరీర్‌లో ఇది ఓ మెమరబుల్‌ మూవీ అవుతుంది.

యువసామ్రాట్‌ నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, జగపతిబాబు, సంపత్‌, కౌసల్య, ఇర్షాద్‌(పరిచయం), చలపతిరావు, అన్నపూర్ణ, పృథ్వీ, సప్తగిరి, వెన్నెల కిషోర్‌, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, బెనర్జీ, సురేఖావాణి, అనితా చౌదరి, రజిత, ప్రియ, తాగుబోతు రమేష్‌, ఇష్క్‌ మధు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, స్క్రీన్‌ప్లే: సత్యానంద్‌, సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి.విశ్వేశ్వర్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, డాన్స్‌: రాజుసుందరం, ఆర్ట్‌: సాహి సురేష్‌, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, నిర్మాత: నాగార్జున అక్కినేని, కథ, మాటలు, దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ కురసాల.
]]>