ఈ అరాచకం ఎప్పటికి ఆగుతుంది…..

vijay2

మహిళలను దేవతలుగా కొలిచిన ఈ నేలపై యిన్ని గోరాలా.నిర్భయ,నందిని ఘటనలు మల్లి పునరావృతం అవ్వకూడదు అనుకునే లోపే దేశం లో ఏదొక మూలా అలంటి సంఘటనలు ఎదురవుతూనే ఉన్నాయి అంటూ తనతోటి నటులైన భావన వరలక్ష్మి ల మనో ధైర్యాన్ని మెంచుకుంటూ,వారికి నా మద్దతు ఉంటుంది అని,మహిళలపై జరుగుతున్నా అకృత్యాలు తలుచుకొని తన భాదను సోషల్ మీడియా లో ఒక లేక రూపం లో వ్యక్తం చేసింది నటి స్నేహ.ఆ లేటర్ లో దయచేసి ఈ అకృత్యాలను ఆపండి అంటూ ఆగ్రహవేదనలను వ్యక్తం చేసింది స్నేహ.

చాలా మంది మహిళలు తమకు జరుగుతున్నా అన్యాయాలను బయటకి చెప్పలేకపోతున్నారు ఎందుకంటె సమాజానికి బయపడి దీనికి కారణం వారు చూపించే ఓదార్పు కన్నా వారి విమర్శలే ఎక్కువ.ఇప్పుడు అమ్మాయిలు వారి వేషధారణ వల్లే ఇలాంటి అఘయిత్యాలు జరుగుతున్నాయి అంటున్నారు.మరి మూడేళ్ళ పాపని కూడా వదలట్లేదు కదా మరి అప్పుడేమవుతున్నాయి ఆలా మాట్లాడే వారి నోర్లు ఎందుకు పెగలట్లేదు ఇంకా అమ్మ పొత్తిళ్ళలో ఆడుకునే పసికందులను సైతం రాక్షసం గా వేధించి చంపేస్తున్నారు.ఆ సంఘటనలు చూస్తుంటే గుండె తరుకు పోతోంది.సేలం లో పదేళ్ల పాపా పై ఐదుగురు వ్యక్తులు కలిసి వేధించి చంపేశారు పాపం ఆ పిల్ల యెంత నరకం అనుభవించి ఉంటుంది.దయ చేసి ఇలాంటి అకృత్యాలను ఆపండి.

తప్పు ఎక్కడ జరుగుతుంది?మదర్ ఇండియా గా దేశాన్ని పిలవబడే రాజ్యం లో ఎం జరుగుతుంది?జీవనదులుకే మహిళల పేర్లు పెట్టారు,దేవుడి తో సమానం గా దేవతలను పూజిస్తారు,పురాణాలలో దేవుడు తనలో సగ భాగాన్ని అర్దాంగి కి ఇచ్చాడు.అని చెప్తుంటారు.కానీ ప్రస్తుత కాలంలో పురుషుడు కాలి కింద నలిగి పోతూ, గిల గిల కొట్టు కుంటున్నాయి మహిళల మానాలు ప్రాణాలు.దయచేసి ఆపండి ఈ అఘాయిత్యాలు అంటూ స్నేహ తన ఆవేదనను వ్యక్తం చేసింది.

ఇటువంటి అకృత్యాలు తిరిగి జరగకుండ పోరాడవలసిన సమయం వచ్చేసింది.మేము గౌరవం గా బ్రతుకుతున్నాం అని చెప్పుకోవడానికి కావాల్సిన పోరాటం చెయ్యాలి దానికి సమయం వచ్చేసింది.ముఖ్యం గా మగాడు పసి పిల్లల వైపు కి కన్నెత్తి చూడాలన్న వణుకు పుట్టేలా మనం పోరాటం చెయ్యాలి.

నిర్భయ,నందిని,రితిక,హాసిని,…ఇంకా యంతమంది?ఇక ఈ దేశం లో బాధితులు ఉండకూడదు.మాకు న్యాయ కావలి,మాకు గౌరవం గా బ్రతికే హక్కు కావలి. ఈ సందర్భం గా నేనొక చిన్న అడుగు వేస్తున్నాను,చాలా ముఖ్యమైనది ఓ తల్లి గ నేనొక ప్రతిజ్ఞ చేస్తున్నాను మహిళలను గౌరవం గా చూసేలా,మహిళల హుందా తనానికి తగ్గట్టు ప్రవర్తించేలా నేను నా కొడుకుని పెంచుతానని అందరికి మాట ఇస్తున్నాను అంటూ స్నే హ లేటర్ లో పేర్కొన్నారు..]]>