రెట్టించిన ఉత్సాహంతో ఉన్న భారతీయ జనతా రానున్న ఎన్నికల్లో ఇదే స్ఫూర్తిని వెళ్తుందని ప్రధాని మోడీ అన్నారు, పరిపాలనకు గీటు రాయి ఏ ఎన్నికలే అని అన్నారు, ఏ గెలుపు మాలో మరింత వేగాన్ని బాధ్యతను పెంచిందని అన్నారు, ఈ విజయంతో 125కోట్ల ప్రజల ఆకాంక్షలను సాకారం చేసేదిశగా 2022 నాటికీ నవ భారతం నిర్మిస్తామని మోడీ ధీమా వ్యక్తం చేశారు. యూపీ, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంతో.. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధానమంత్రికి అభినందన సభ ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి అశోక్ రోడ్డు ప్రారంభం నుంచి పార్టీ కార్యాలయం మోదీ ర్యాలీగా తరలివచ్చారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ఇతర ముఖ్యనేతలు స్వాగతం పలికారు.ఈ సభలో మోడీ భారీ మెజారిటీతో గెలిపించిన యూపీ, ఉత్తరాఖండ్ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
‘న్యూ ఇండియా’ కోసమే కృషి – యూపీ ఫలితాలు ‘దేశ రాజకీయాల దిశను నిర్ణయిస్తాయి. ఈ విజయంతో దేశంలోని యువకుల (దేశంలో 65 శాతం మంది 35 ఏళ్లలోపు వారే) కలల సాధనకు, మహిళల సాధికారత సాకారానికి, పేదల, మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలను నిజం చేయడానికి న్యూ ఇండియా నిర్మాణానికి పునాది పడింది’ అని ప్రధాని మోడీ అన్నారు దేశంలోని పేదలు ఏదో ఆశించే స్థితి నుంచి ‘స్వశక్తితో ముందుకెళ్తాం. పని ఇప్పించండి’ అనే ఉన్నతమైన ఆలోచన లోకి మారారు అన్నారు.విజయం మనలో మరింత బాధ్యతను పెంచి, వినమ్రతతో పనిచేసేందుకు కొత్త శక్తినిస్తుంది’ అని మోదీ పార్టీ శ్రేణులతో అన్నారు యూపీ, ఉత్తరాఖండ్‌లలో బీజేపీ ఘన విజయానికి పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అండ్ కో తీవ్రంగా కృషిచేసిందని ప్రధాని ప్రశంసించారు. ‘ఈ విజయోత్సవ గౌరవం అందుకోవటానికి వారికే అర్హత ఉంది. దేశ చరిత్రలోనే ఓ రాజకీయ పార్టీకి ఇంత భారీ విజయాన్నందించిన ఘనత అమిత్ షాదే. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించటం, సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకుని దేశంలోని మూలమూలలకు పార్టీని విస్తరింపజేయటంలో షా పాత్ర అత్యంత కీలకం’ అని మోదీ ప్రశంసించారు.
2014 సాధారణ ఎన్నికల కన్నా.. యూపీ, ఉత్తరాఖండ్ ఎన్నికల ఫలితాలు గొప్పవని అమిత్ షా తెలిపారు. ప్రధాని ప్రసంగానికి ముందు అమిత్ షా మాట్లాడుతూ.. ‘యూపీ విజయం అపూర్వం, అద్భుతం. ప్రధాని నరేంద్ర మోదీ పేదలకోసం తీసుకుంటున్న నిర్ణయాలకు ఇది ప్రజామోదం. వచ్చే ఏడాది జరగనున్న హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, గుజరాత్‌తోపాటు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లోనూ విజయ దుందుభి మోగిస్తాం. ఈ ఎన్నికల విజయంతో 2019లో మరింత భారీ ప్రజామోదం పొందుతాం. మోదీ నాయకత్వంపై ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారు. నోట్లరద్దుతో నే పేదలు బీజేపీకి దగ్గరయ్యారు’ మధ్య తరగతి ఆమోదం మోడీకి ఉందని అన్నారు . ]]>