బంగారు తెలంగాణా లో మీడియా అడ్డుగా ఉందేమో పాలకులకి అందుకే ఇక నుంచి నగర పంచాయతీ మునిసిపాలిటీల్లో జరిగే కౌన్సిల్ సమావేశాలకు మీడియాని పిలిచే అవసరం లేదనే ఆదేశాలు జారీ అయ్యాయట..ఆలా మీడియా ని పిలిచి మరీ వ్యతిరేక వార్తలు రాయించుకోవడం ఎందుకు అనేది బహుశా సర్కార్ ఆలోచన ఐ ఉంటుంది ఎందుకంటె సహజం గా కౌన్సిల్ సమావేశాలు ప్రశాంతం గా జరిగిన దాఖలాలు తక్కువ . ఏదొక విషయం లో అధిక ప్రతి పక్షాల మధ్య మాత్రమే కాదు స్వపక్షం లో కూడా తిరుగుబాటు చేస్తున్నవారున్నారు ఐతే ఈ సమావేశాల్లో అభివృద్ధి మీద చర్చ చేసి తీర్మానాలు ఆమోదిస్తుంటారు ఈ క్రమం లో వాగ్వాదాలు ఘర్షణలు జరుగుతుంటాయి ఇవన్నీ మీడియా ద్వారా బైటకి పొక్కడం చిలవలు పలవలు గా వార్తలు రావడం మీడియాలో హైలైట్ కావడం కోసం కొందరు ప్రజా ప్రతినిధులు సమావేశం లో చేసే ఓవర్ యాక్షన్ ఇదంతా ప్రజలు దృష్టిలో పడి నెగెటివ్ పబ్లిసిటీ కావడం పరిపాటిగా మారింది అనేది ఒప్పుకోవాల్సిన అంశమే అయినా
సర్కార్ మాత్రం తన పని చక్కబెట్టుకొనేందుకు మీడియాని తొక్కేస్తోందేమో అనుకోవాల్సి వస్తుంది..సో ఇక పై మీడియాకి నో కుర్చీ నో చాయ్ సమోసా..ఇదే జరిగితే ఇకపై మీడియాకి ఏ సమావేశంలోకి ఎంట్రీ లేకుండా చేసే అవవకాశం లేకపోలేదు ..
]]>