నియోజక వర్గాల ఆశలపై నీళ్ళు

ఏనుగు కధ లా వుంది మన రెండు రాష్ట్రాల్లో నియోజక వర్గాల పెంపు  పరిస్థితి సభలు ప్రారంభం కావడం ఇప్పట్లో కుదరదని కేంద్రం చెప్పడం పరిపాటిగా మారింది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్ల పెంపు ఖాయమంటూ ఈ మధ్య వార్తలు  ఊపు అందుకున్న సమయంలో మంగళవారం కేంద్రం మరోసారి స్పష్టత ఇచ్చింది. టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్సరాజ్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. తెలంగాణలో సీట్ల పెంపు కోసం ప్రభుత్వం లేఖ రాసిందని..అయితే ప్రస్తుత పరిస్థితిలో పెంపు వీలుకాదని హన్సరాజ్ స్పష్టం చేశారు.

విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం సీట్ల సంఖ్య పెంచాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు చాలా కాలంగా అడుగుతున్నాయని హన్సరాజ్ సభలో  తెలిపారు. అయితే అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలంటే రాజ్యాంగంలోని 171వ ఆర్టికల్‌లోని మూడవ నిబంధనను సవరించాల్సి ఉందని ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాభా లెక్కల ప్రకారం 2026 నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరగాల్సి ఉందని, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అప్పుడే అసెంబ్లీ సీట్ల పెంపు ఉంటుందని హన్సరాజ్ తేల్చిచెప్పారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న టీడీపీ, టీఆర్ఎస్ మాత్రం అసెంబ్లీ సీట్ల పెంపునకు రాజ్యాంగ సవరణ అవసరం లేదని వాదిస్తున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి కూడా తీసుకువెళ్లాయి. ఎవరేం వాదించిన ఇప్పట్లో పెంపులేనట్టే
]]>