టెలికాం సెక్టార్ ని తన బంపర్ ఆఫర్స్ తో కుదేలు చేసిన రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. త్వరలో ఇంటర్నెట్ ప్రొటోకాల్ టెలివిజన్ (ఐపి టీవీ) ప్రసారాలు ప్రారంభించబోతోందని తెలుస్తోంది. దీనిపై కంపెనీ ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు కానీ ఆన్లైన్లో లీకైన సెట్‌టాప్ బాక్స్‌ను చూస్తే జియో త్వరలో ఐపిటీవీ సేవల రంగంలోకి ప్రవేశిస్తుందన్న ప్రచారానికి బలాన్నిస్తోందనే చెప్పాలి సెట్‌టాప్ బాక్సులు ఉచితంగా అందించడంతో పాటు, డిటిహెచ్ ఆపరేటర్ల కంటే 40-50 శాతం చౌకగా ఐపిటీవీ ప్రసారాలు అందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. అదే జరిగితే టెలికాం రంగంలో మాదిరిగానే డిటిహెచ్ రంగంలోనూ పెద్ద కుదుపు తప్పదు ఐపిటీవీ సేవలతోపాటు రిలయన్స్ జియో త్వరలోనే కేబుల్ టీవీ రంగంలోకీ ప్రవేశించే అవకాశం ఉంది
]]>