అధ్యక్షుడిని కాకపోయినా అమెరికన్స్ కోసమే మా సేవలంటున్న ఒబామా

ఒబామా దంపతులు ప్రజలకు చేసే సేవలను,వారికిచ్చిన మాటను మర్చిపోలేదు.“అధ్యక్ష పదవికి నేను దూరం అవ్వొచ్చు, కానీ అమెరికన్‌ ప్రజలకు సేవ చేయడానికి మాత్రం ఎప్పుడూ వెనకాడబోనని” తన పదవీ కాలం పూర్తైన సందర్భంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా అన్నారు.ఆ ప్రకారం గానే చికాగోలోని దక్షిణ ప్రాంత ప్రజలకు ఉద్యోగాలను కల్పించే సేవా కేంద్రాన్ని ప్రారంభించేందుకు రెండు మిలియన్‌ డాలర్లను విరాళంగా ప్రకటించారు ఒబామా దంపతులు.చికాగోలోని జాక్సన్‌ పార్క్‌లో దీనిని ఏర్పాటుచేయనున్నారు.

చికాగోలో ఈ కమ్యూనిటీ సెంటర్‌ ఏర్పాటు అవడానికి ఇంకా నాలుగేళ్లు పట్టనుందని అందరూ భావిస్తుండగా అప్పటి వరకు ఎందుకు మేమున్నాం కదా అంటూ  ఒబామా దంపతులు ముందుకొచ్చి ఈ విరాళంఇచ్చారు ఈ సందర్భంగా మాట్లాడిన ఒబామా“మిషెల్లీ నేను వ్యక్తిగతంగా రెండు మిలిన్‌ డాలర్లను సమ్మర్‌ జాబ్స్‌ ప్రోగ్రామ్‌ కోసం విరాళంగా ప్రకటిస్తున్నాం. పని కోరేవారికి ఇది సరైన మార్గం. దీని ద్వారా వారికి సదావకాశాలు అందించవచ్చు. మనందరం కలిసి పనేచేసేందుకు మరో నాలుగేళ్లపాటు మేం వేచి చూడలేం. అందుకే నేను, మిషెల్లీ ఇప్పుడే దానిని ప్రారంభించాలని అనుకుంటున్నామని” సమాజ సేవ మొదలెట్టేసాడు

]]>