ఆంధ్రాలో ఐఏఎస్ లే లేరా అంటున్న పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్‌మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా అనిల్‌ కుమార్‌ సింగల్‌ను ఎంపిక చేయడంపై అసహనాన్ని వ్యక్తం చేశారు.నార్త్‌ ఇండియన్‌ ఐఏఎస్‌లకు తాను వ్యతిరేకం కాదని,కానీ ఇక్కడ వారిని వదిలి అతడిని టీటీడీ ఈవోగా ఎంపిక చేయడం ఏంటని ప్రశ్నించారు.ఉత్తరాన ఉన్న అమర్‌నాథ్‌, వారణాసి, మధుర వంటి పుణ్యక్షేత్రాలలో అధికారులుగా దక్షిణాది వారిని తీసుకోనప్పుడు మనం ఎందుకు వారికి ఇవ్వాలని పవన్‌ అడిగారు.మనమీద ఉత్తరాది వారు చిన్నచూపు చూస్తున్నప్పుడు,మనం ఎందుకు వారికి ఉన్నతాధికారాలు ఇవ్వాలని పవన్‌ అడిగారు.ఈ ఎంపికను చంద్రబాబు, టీటీడీ ఎలా స్వాగతించారో అర్థం కావడం లేదని తెలిపారు. దీనిపై వారు ఖచ్చితంగా తెలుగువారికి అలాగే దక్షిణాది ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉందన్నారు.

]]>