మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్…

ఎన్నిసార్లు భారత్ ఎదురు దాడులు చేసి హెచ్చరించినా.పాక్‌లో మార్పు రావడంలేదు సరికదా పాక్ వక్రబుద్ధి మార్చుకోవడం లేదు.సరిహద్దులో ఎప్పుడూ ఎదో ఒక అలజడి సృష్టిస్తూనే ఉంది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ సరిహద్దులోని సైనికులు, సామాన్యుల ప్రాణాలు తీస్తోంది.

గురువారం తెల్లవారుజామున జమ్మూకాశ్మీర్‌ రాజౌరి జిల్లాలోని నౌషెరా సెక్టార్‌లో భారత సైన్యంపై పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. ఈ కాల్పుల్లో సరిహద్దు గ్రామానికి చెందిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా,ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. పాక్ కాల్పులను భారత సైన్యం ధీటుగా తిప్పికొడుతోంది. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.

]]>