వారిద్దర్ని సాగనంపి సిబిఐ దర్యాప్తు కు ఆదేశించాలి పన్నీర్ డిమాండ్

తమిళనాడు రాజకీయ అనిశ్చితి  తెలియని విషయం ఏమి కాదు .తాజాపరిస్థితులు మరింత గందర గోళం మాత్రమే కాదు రాజకీయ చతురత ను కూడా బైట పడేస్తున్నాయి, సెల్వం దెబ్బకి మహామహా వారే గింగిరాలు తిరిగి ఆలోచన్లో పడాల్సిన పరిస్థితులు తమిళనాడులో రోజు రోజుకి మారుతున్నాయి, నిన్నటికి నిన్నరెండాకులు గుర్తు కోసం ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వబోయి బోర్ల పడిన శశికళ వర్గం పరిస్థితి ఇప్పుడు ఏం చేయాలో అర్ధం కానీ డోలాయమాన స్థితిలో పడింది ఇదిలా ఉండగా ఇదే అదనుగా భావించిన తిరుగుబాటు నాయకుడు పన్నీర్ సెల్వం తన పట్టును మరింత బిగిస్తున్నారు.

పార్టీని కాపాడుకొనేందుకు  తానూ అమ్మ ఆశయాలు నిలబెట్టేలా  ఇందుకు పార్టీని విలీనం చేసేందుకు సిద్ధమని సంకేతాలిచ్చారు, తాజాగా  రెండు డిమాండ్లను సెల్వం వర్గం నాయకుడు మునుస్వామి తెర మీదకు తెచ్చారు, మొదటగా శశికళ ,దినకరన్  లను పార్టీ నుంచి వెలివేయడం, అమ్మ మృతి పై సిబిఐ దర్యాప్తు చేయించాలని కేంద్రాన్నికోరాలని షరతులను పెట్టారు, నిన్నటి వరకు పట్టు లేదు అమాయకుడు అంటున్న సెల్వమ్ రాజకీయ చదరంగం లో మాస్టర్ డిగ్రీ తీసుకున్నట్టే కనిపిస్తున్నారు. శశికళ జైలుకి వెళ్లే ముందు జయ సమాధి మీద  మూడు సార్లు చరిచి చేసిన శపధం అప్పట్లో చర్చ ఐనా, సైలెంట్ గా పని కనిచేస్తున్న సెల్వం తీరు కూడా శపధం చేసిన స్టయిల్లో నే ఉన్నట్టుంది..మొత్తానికి అమ్మ వారసత్వం కోసం చాయ్ వాలాలు  ఇద్దరూ ఒకటై రాజకీయం నడిపిస్తున్నారా !

 ]]>