నిన్ను విడమాట్ట-(తమిళ రాజకీయ ఎత్తులు )

వెళియ పో (బైటికి పో ) అంటుంటే నిన్ను విడ మాట్ట (నిన్ను వదలను ) అంటూ సాగే  ఓ సినిమా సన్ని వేశం ఆల్మోస్ట్ అందరికి గుర్తుండే ఉంటుంది, ఇప్పుడు తమిళనాడులో కూడా పన్నీర్ సెల్వం,స్టాలిన్ ల  పట్టుదల అలానే వున్నాయి, ఎలాగైనా పళనిస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఇద్దరూ కంకణం కట్టుకుని వున్నారు ఒకరేమో నా పదవి బెదిరించి లాక్కున్నారని ,ఇంకొకరేమో అనుచితం గా వచ్చిన పదవిని మొత్తం తమిళ నాడులో అప్రజాస్వామిక పరిపాలన నడుస్తోందని రచ్చ రచ్చ చేస్తున్నారు, ఇదిలా ఉండగా తమిళనాడులో ప్రభుత్వ పథకాల మీద “అమ్మ” బొమ్మ ను తీసేయాలని కోర్ట్ లో ఒక పిటీషన్ దాఖలయింది,ఇటు వైపు పన్నీర్ సెల్వం రాష్ట్రము లో పర్యటించేందుకు తన ప్రచార రధాన్ని రెడీ చేసుకొన్నారు , స్టాలిన్ ఏమొ నిరాహార దీక్షలకు దిగుతున్నారు ,ఐతే స్టాలిన్ నిరాహార దీక్షకు అంతగా ప్రజాదరణ రాలేదని టాక్,ఇక శశి కళ ఇంతటి ప్రతికూల పరిస్థితిలో కూడా తన మార్కు రాజకీయాన్ని ప్రదర్శిస్తూనే వుంది ,ఐతే ఇక్కడో లాజిక్ ని చూడాల్సి వుంది అదేంటంటే త్వరలో రాష్ట్ర పతి ఎన్నిక ఉంది భాజపా అభ్యర్థి ని గెలిపించుకోవాలంటే కేంద్రం ఈ మాత్రం డ్రామా ఆడాలి తప్పదు అంతర్గతం గా సెల్వమ్ మీద ప్రేమ వున్న,శశి కళ మీద కక్ష వున్నా,ఈ ఎన్నిక పూర్తయ్యే వరకు చూసి చూడనట్టుండాలి లేదా కొంత విషయాన్నీ జాప్యం చెయ్యాలి ఎందుకంటే aaidmk ఎంపీ ల మొగ్గు అవసరం కాబట్టి.సో ఇప్పట్లో కేంద్రం వ్యవహారం ఇదే కావొచ్చు ఇక కరుణానిధి పార్టీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అనేది తెలిసిందే , అంత వరకు సెల్వమ్ ఖాళీగా కూర్చోకుండా ప్రజల్లోకి వెళ్లి ఇంకొంచెం ప్రభుత్వ వ్యతిరేకతను కనుక తీసుకు రాగలిగితే రానున్న నాలుగు సంవత్సరాలు సెల్వానికి అడ్డు ఉండదు కానీ డబ్బు తో ముడి పడి  వున్న అంశం కాబట్టి సెల్వానికి ఫైనాన్స్ ఎవరు చేస్తారు అనేది కూడా చుడాల్సి వుంది.ఐతే దైర్యంగా సెల్వం ప్రచార రధాన్ని తయారు చేసుకొని ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అవడం మాత్రం మెచ్చుకోదగ్గ విషయం .

]]>