పన్నీర్ బలమా పళని బలమా !

no-petrol-no-helmet

తమిళనాడు లో పళని స్వామి ప్రభుత్వానికి కావాల్సింది 117 మంది మద్దతు.ఇప్పటికే 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది అని అంటున్నారు .పన్నీర్ కి దాంట్లో పదోవంతు కూడా లేదు అనేది ఇప్పటి టాపిక్ పన్నీర్ సెల్వమ్ ఎమ్మెల్యేల పై ఒత్తిడి తీసుకువచ్చి తన వైపు కి తిప్పుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందని,పన్నీర్ వేసిన ఎత్తుగడలను పసిగట్టిన పళని స్వామి రాజకీయం గా అలోచించి ముందే మేల్కొని ప్రమాణ స్వీకారం చేసిన మూడో రోజే అంటే ఈ నెల 18 న అసెంబ్లీ సమావేశానికి ఏర్పాటు చేసి,బలనిరూపణకు టీమ్ తో రెడీ అవుతున్నట్టే కనిపిస్తోంది

పన్నీర్ మాత్రం గోల్డెన్ బే శిబిరం లో బందీలుగా ఉన్న ఏంఎల్ఏ లు విడుదుల ఐతే వారంతా తన వైపు కి వచ్చే అవకాశం ఉందనిఅయన వాదన .8 రోజులలో 9 మంది ఎమ్మెల్యేలను మాత్రేమే తన వైపు కి తిప్పుకోగలిగినసెల్వం బల పరీక్షకు 15 రోజులు గడువు దొరికితే ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్లి మాట్లాడొచ్చు అనుకున్నాడట కానీ శశికళ ప్లాన్ కారణంగా ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.అయితే ‘అమ్మ” సెంటిమెంట్,ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లదంటూ ఎన్నికల కమిషన్ వద్ద పరిశీలనలో ఉన్న పిర్యాదు తనను మరో సారి ముఖ్యమంత్రి పీఠం పై కూర్చొన బెడతాయ్ అని ఇంకా ఆఖరి ఆశ పెట్టుకున్నాడు సెల్వమ్. శశి కళ మీద అనర్హత వేటు పడిన పక్షం లో పార్టీ తిరిగి మదుసూదనన్,సెల్వం ల చేతుల్లోకి వస్తుంది.శశికళ ఎంపిక పై ఎన్నికల కమిషన్ తన నిర్ణయాన్ని శుక్రవారం ప్రకటించే అవకాశం ఉంది. మొత్తానికి పెద్దన్న పాత్రను మోడీ అదే భారతీయ జనతా పార్టీ బాగానే పోషిచినట్టే కనిపిస్తోంది మధ్యలో బలైంది సెల్వం,వున్నది వుంచుకున్నది పోయినట్టైంది ఈరోజు రాజకీయాన్ని బట్టి రేపేమిటో చూడాలి .

]]>