విలువలు చంపుకోలేకే బెడ్ రూమ్ కి వెళ్ళలేదు

సినిమా రంగం లో అవకాశాల కోసం వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువే అలాగని వాళ్ళని వాడుకొనే  వాళ్ళ సంఖ్యా ఎక్కువే..తాజాగా  ఓ మలయాళం హీరోయిన్ ఏ అంశం మీద ఓ ఛానల్ ఇంటర్వ్యూ లో ఆసక్తి కరమైన విషయాలు చెప్పింది ..మలయాళ నటి పార్వతి మీనన్ తన అనుభవాల గురించి నోరు విప్పింది. తమిళ సినీ పరిశ్రమలో ధనుష్‌తో ‘మారియన్‌’, ఆర్య, రానాలతో ‘బెంగళూరు డేస్‌’ వంటి సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె తాజాగా ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల పరిస్థితి గురించి మాట్లాడింది.

సినీ పరిశ్రమలో ‘క్యాస్టింగ్‌ కౌచ్‌’ సంస్కృతి చాలా ఎక్కువని, అవకాశాల కోసం లొంగిపోక తప్పదని అర్చన, మాధవీలత, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, కస్తూరి, రాధికా ఆప్టే వంటి హీరోయిన్లు ఈ విషయాన్ని బహిరంగంగా మాట్లాడిన విషయం తెలిసిందే .
అవకాశాలు కావాలంటే అన్నింటినీ వదులుకోవాల్సిందే. ఫలానా సినిమాలో హీరోయిన్ లేదా ఇంకేదైనా పాత్ర కావలనంటే డైరెక్ట్ గా బెడ్రూమ్‌కు రమ్మని డైరెక్ట్‌గానే అడుగుతారు అని  మలయాళ పరిశ్రమలో పలువురు హీరోలు, దర్శకులు నన్ను తమ బెడ్రూమ్‌కు రమ్మనేవారు. అవకాశాలు కావాలంటే ఇలాంటివన్నీ కామన్‌ అని సర్దిచెప్పేవారు.కానీ సినిమాలో అవకాశాల కోసం విలువలు చంపుకోలేక బెడ్ రూమ్ కివెళ్ళ లేదని అందుకే ఇప్పుడు ఖాళీగా కూర్చోవాల్సి వచ్చిందని “బెడ్రూమ్‌” కి రెడీ ఐ ఉంటే ఇప్పటికి చాలా సినిమాలు చేసేదాన్ని’ అని చెప్పింది….
]]>