అన్నయ్య వల్లే అంతా..పవన్ కళ్యాణ్

train accident in erope

జనసేన అధినేత,సినీ హీరో పవన్ కళ్యాణ్ హార్వర్డ్ యూనివర్సిటీ కి వెళ్లిన విషయం తెలిసిందే అక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆసక్తి కరమైన విషయాలను షేర్ చేసుకున్నారు అంతే కాదు తన సక్సెస్ కి కారణం కూడా చెప్పేసారు. తన పెద్ద అన్నయ మెగాస్టార్ చిరంజీవి కి సలహాలు ఇచ్చే వాడిని అని, తెలిసి తెలియని వయస్సులో తానిచ్చిన సలహాలను అన్నయ చిరంజీవి నవ్వుతు వినేవారని గుర్తుచేసుకున్నారు .ఒకానొక సందర్భం లో ఫిలాసఫీ,ఆధ్యాత్మిక విషయాలను ఆయనకు బోధించేవాడిని అని చెపుకొచ్చారు. తెలియని వయసులో తాను చెప్తున్న మాటలను గ్రహించిన అన్నయ్య “ముందు నువ్వేదైనా సాధించి ఆ తర్వాత ఇతరులకు మార్గదర్శంకంగా ఉండాలని” అన్నారని ,ఆ తర్వాత తన జీవితం లో {పవన్ కళ్యాణ్ }కోల్పోయిన వాటిని తిరిగి పొందేందుకు ప్రయత్నం చేసానని చెప్పుకొచ్చారు.నటన పట్ల అంతగా ఆసక్తి లేకున్నా పట్టుదలతో దృష్టిని మరల్చి కెరీర్ ని సాదించానని అన్నారు.అన్నయ సలహా వల్లే ఒక అవగాహన వచ్చిందని పవన్ అన్నారు.

]]>