మీ కోసం జనసేన పోరాడుతుంది…పవన్

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ రోజు అగ్రి గోల్డ్ భాదితుల సమస్యలు విన్న  జన సేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.  మాట్లాడుతూ .తప్పు చేసినప్పుడే అడగాలి ప్రజలలో దమ్ము దైర్యం ఉండాలి.మొదటి చెక్కు బౌన్స్ ఐన రోజే ప్రశ్నించి ఉంటె సమస్య ఇంతవరకు వచ్చేది కాదు.ఈ సమస్య ఇప్పటివరకు చట్టం చేతుల్లో ఉంది అందుకే నేను పట్టించు కోలేదు.చట్టం బలహీనులకు బలం  గా బలవంతులకు బలహీనంగా  పని చేస్తుంది.కానీ కోర్ట్ నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకపోకపోవడానికి కారణం తెలుసుకోవాలి.రాజకీయ నేతలు యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసారు.

అగ్రి గోల్డ్ సంస్థకు పలుకుబడి ఉన్న నేతలు వత్తాసు పలుకుతున్నారు.ఇలాంటి సంస్థలకు ప్రభుత్వాలు చేయూతనివ్వకూడదు.లక్షల మంది ప్రజలు మోసపోయారు.సంస్థలు నమ్మించి మోసం చేస్తే ఏజెంట్స్ ఎవరి దగ్గరకి వెళ్తారు వారి భాద ఎవరికీ చెప్పుకుంటారు.వారి బాధ్యతను ప్రభుత్వాలే తీసుకోవాలి.అసలు అగ్రిగోల్డ్ కి ఆస్తులు ఎక్కడ ఉన్నాయి ఎంత ఉన్నాయి,క్షుణ్ణం గా తెలుసుకొని ఈ సమస్య పరిష్కరించడానికి జనసేన సహాయం చేస్తుందని అని అన్నారు.మీటింగ్ లో సినిమాల గురించి అభిమానులు మాట్లాడితే నేను సమస్య లు తెలుసుకోవడానికి వచ్చాను.కేవలం ప్రజా సమస్యల గురించే మాట్లాడండి అన్నారు .

]]>