జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పాదయాత్ర ను చేసేందుకు సిద్దమయ్యాడు ఈ యాత్రకు సంబంధించి పూర్తి ప్లాన్ మరో రెండు రోజుల్లో ఖరారు చేస్తారట ఐతే ఈ పాద యాత్ర తాను రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన మొదట ప్రకటించిన అనంతపురం జిల్లా నుంచే ప్రారంభిస్తాడట , ఈ జిల్లాలోని కర వుఅంశాన్ని అజెండాగా తీసుకుని పాదయాత్ర కు రెడీ అవుతున్నాడు పవన్ కల్యాణ్ అనంతపురం జిల్లాపై దృష్టి సారిస్తే అనంతపురం, కదిరి, పుట్టపర్తి, హిందూపురం, ధర్మవరం, గుంతకల్లు నియోజకవర్గాల్లో ఉన్న బలిజ సామాజికవర్గ ఓట్లర్లపై ఆ ప్రభావం ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, పాదయాత్ర చేయడం ద్వారా ప్రభుత్వంపై వత్తిడి పెంచడానికి పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం.