నాన్న తరచూ చెప్తుండేవారు..పవన్ కళ్యాణ్

జనసేన అధినేత,సినీనటుడు పవన్ కల్యాణ్ ట్వీట్ చేసారు ఏపీకి చెందిన దివంగత కమ్యూనిస్ట్ నేత, రచయిత తరిమెళ్ల నాగిరెడ్డి జయంతి సందర్భం గా పవన్ ఆయన్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా తరిమెళ్లకు పవన్ తలవంచి నమస్కరిస్తున్నట్టు చెప్పుకొచ్చారు కామ్రేడ్ తరిమెళ్ల నాగిరెడ్డి శత జయంతి సంవత్సరం ఇది అంటూ ట్వీట్ చేశారు. చిన్నతనంలో మా తండ్రి తరిమెళ్ల రచించిన పుస్తకం చదవాలంటూ సలహా ఇచ్చారు.. ఆ పుస్తకం పేరు ‘తాకట్టులో భారతదేశం’ అని పవన్ చెప్పుకొచ్చారు. నిజంగా ఆ పుస్తకంలో చాలా విలువైన, అందరికీ అవసరమైన విషయాలు చెప్పారు. అప్పట్లో ఆ పుస్తకాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను కానీ నిజంగా ఆ పుస్తకంలో తరిమెళ్ల చెప్పిన విషయాలు అప్పటికీ ఇప్పటికీ సరిగ్గా సరిపోతాయంటూ పవన్ ట్విట్టర్‌లో రాశారు.సహజం గా విమర్శ నాత్మకం గా త్వీట్ చేయక పోవడం విశేషం.

]]>