మాకోసం కూడా పోరాడాలి.. పవన్ కు అగ్రి బాధితుల గోడు

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ రోజు అగ్రి గోల్డ్ భాదితుల సమస్యలు అడిగి తెలుసు కున్న జన సేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కలిసి సమస్యను వివరించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా,ఇతర రాష్ట్రాల భాదితులు కూడ హాజరయ్యారు అగ్రి గోల్డ్ ఏజెంట్లు గా డబ్బు కట్టించిన వారు, మదుపు దారులు హాజరయ్యారు.ప్రతి ఒక్కరు వారి వారి భాదలను పవన్ కి వివరిస్తున్నారు.మా డబ్బులు కట్టించుకున్నారు అంటూ జనం తో దెబ్బలు కూడా తిన్నాం ఇప్పటికే 107 మంది ఆత్మ హత్యలు చేసుకున్నారు మేము కూడా చనిపోదాం అనుకున్నాం పిల్లల్ని చూసి,ప్రజలను మోసం చేశాo అన్న మచ్చతో చని పోవడం ఇష్టం లేక ఆగిపోయం అంటూ కళ్ళ నీరు పెట్టుకున్నారు.జనసేన అంటే జనకోసం అన్నారు మీరు ప్రజల కోసం పోరాడుతున్నారు మాకోసం కూడా పోరాడండి మేము కూడా చనిపోయే పరిస్థితులలో ఉన్నాం అంటూ వారి గోడు జనసేన అధినేత పవన్  కళ్యాణ్ కు వివరించారు .

]]>