అమ్మా పాలు అమ్ముకోకమ్మ…

మనిషి డబ్బు కోసం ఎంతకైనా దిగజారతాడు అనేది అక్షర సత్యం.కన్న తల్లి పాలు అమ్ముకొంటోంది అంటే వారి పేదరికానికి నిదర్శనం ఇంతకన్నా ఏముంటుంది.పది రక్తం బొట్టులు కలిస్తే ఒక పాలు బొట్టు అవుతుంది తల్లి తన రక్తాన్ని విరిచి పిల్లలకోసం పట్టించే పాల తో కూడా వ్యాపారం చేస్తున్నారు.తల్లి పాలతో వ్యాపారం మొదట అమెరికా లో స్టార్ట్ ఐంది.వీటికి ప్రత్యేకం గా వెబ్ సైట్ లే వెలసాయంటే ఏ రేంజ్ లో బిజినెస్ సాగుతోందో అర్ధం చేసుకోవచ్చు.నేత్ర దానం,అవయవ దానం,రక్త దానం కి,బ్యాంకు లు ఉన్నట్లే తల్లి పాలకు కూడా బ్యాంకు లు వెలిశాయి.అమెరికాలో ఇలాంటి బ్యాంకు లు చాలా ఉన్నాయి.చనుబాలు దేవతలు తాగే అమృతం తో సమానం ఆ అమృతాన్ని అమ్ముకుంటూ మాతృ ధర్మాన్ని అంగట్లో బేరం పెట్టి..కన్న పేగు కన్నీళ్ళు పెడుతుంటే వారి కన్నీళ్లతో కాసులు మూటకట్టుకుంటున్నారు వ్యాపారాలు.

కొందరు స్వార్ధ పరులు ఎక్కడ దేనికి కొరత ఉంటె అక్కడ వ్యాపారాలు మొదలు పెట్టేస్తారు.అలంటి వారే ఇప్పుడు ఈ తల్లి పాలు అమ్మకాల మీద పడ్డారు.తల్లి పలు అమ్మడం ఎలాంటి అనైతికము కాదు చట్టబద్దం అంత కన్నా కాదు అందుకే చీకటి వ్యాపారం కొనసాగుతోంది.కొన్ని సంవత్సరాల క్రితం సహాయం చేసే ధోరణిలో కొన్ని వెబ్ సైట్ లు వెలిసాయి తల్లి పాలు లేని పిల్లలకు పాలు ఇప్పించే మార్గాలు చేయడం కానీ ఇప్పుడు అవే వ్యాపారాలు గా మారాయి.పాలు అమ్ముకునే తల్లులు డీటెయిల్స్ ని అడ్వేర్టైజ్ మేంన్ట్ ల రూపం లో అడ్రెస్స్ లతో సహా అందించడం కోసం ఈ వెబ్ సైట్స్ పని చేస్తున్నాయి.పాలు కొనుక్కునే వారు పాలు అమ్మే వారు ఇద్దరి దగ్గర్నుంచి డబ్బు వసూళ్లు చేస్తున్నాయి.గోడల మీద కూడా “బ్రెస్ట్ మిల్క్ ఫర్ సేల్ “ప్రకటనలు కనపడడం సాధారణమైపోయింది.

అమెరికా లో తల్లి పాలను అమ్మడానికి “ఓన్లీ ది బ్రెస్ట్”అనే వెబ్ సైట్ కేవలం పాలు అమ్ముకునే లేడీస్ కోసం పనిచేస్తున్నట్లు అందులో శాకాహారిణి నేను మాంసాహారిణి ఇంత శాతం పాలు ఇంత రేట్ కి ఇస్తాను అంటూ ప్రకటిస్తున్నారు.ఆ వెబ్ సైట్ లో 45 మిలియన్ ల తల్లి పాలు అమ్మకానికి ఉన్నాయట.1200 మంది ఆడవాళ్లు వెబ్ సైట్ లో నమోదయ్యారు.వాళ్ళందరూ స్వచందం గా అమ్మడానికి సిద్దమైన వల్లే మేము మధ్యవర్తిత్వం మాత్రమే చేస్తున్నాం అంటున్నారు కీన్ కీ .కామ్ ,వీరికి మాత్రం రెండు వైపులా ఇన్ కం.

అమెరికా లో తల్లి పాలు విక్రయం జరుగుతున్నప్పటికి వారికీ సరిపోను పాలు దొరకడం లేదు అందుకే ధనిక తల్లుల చూపు ఇప్పుడు పేద దేశాల పైన పడింది.బ్రాంజ్ సన్ ఫుడ్స్ కంబోడియాలో ఒక మిషనరీ నిర్వాహకుడు ఆయనకు జరిగిన సంఘటన ఆధారం గానే ఈ వాణిజ్య వ్యాపారాన్ని మొదలు పెట్టారు.పేద తల్లులకు వారికీ కావాల్సిన అవసరాలను తీర్చి డబ్బు ఆశ చూపించి తల్లి పాలు తో వ్యాపారం చేసుకుంటున్నారు.

ఒక కన్న తల్లి తన బిడ్డ నోరు కట్టేసి,ధనిక కుటుంబాల పిల్లలకు పాలు అమ్ముకునే పరిస్థితి ఎందుకు వస్తోంది? ఆ తల్లిని పేదరికం నుంచి బయట పడేసేందుకు మార్గాలను అన్వేషించకుండా తన రక్తాన్ని అమ్ముకోవడం బాధాకరం ప్రపంచ వ్యాప్తం గా తల్లి పాలను విక్రయం పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.ఇది ఇక్కడి తో ఆగాలి లేదంటే సంపన్న దేశాల వారు పేద తల్లుల రక్త మాంసాలను పిండేసుకొని..పిల్లలను అనారోగ్యం పాలు చేస్తాయి.కంబోడియా లో మొదలైన తల్లి పాల వ్యాపారం మిగిలిన దేశాలకు సోకితే..ఆ పిల్లలకు అమ్మదనం కరువయ్యే ప్రమాదం ఉంది.

]]>