దేవుడా…మా మోర ఆలకించు

వీసాలు కావాలంటే దేవుడికి మొక్కుకున్నారు.ఇప్పుడు అక్కడ ఉన్నవారిని జాగ్రత్తగా కాపాడమంటూ వారి బంధువులు మొక్కులు చెల్లిస్తున్నారు.చిలుకూరి బాలాజీ వీసాల దేవుడని.మొక్కిన మొక్కు కచ్చితంగా తీరుతుందనే నమ్మకం ఎక్కువ,ఎవరికీ వీసా కావాలన్నా ముందు గుర్తొచ్చేది చిలుకూరి బాలాజీ నే వారి కోరికలు తీరిన తర్వాత ప్రదక్షన్లు చేసి వారి వారి మొక్కులను తీర్చడం ఆనవాయితీ. అమెరికా వెళ్లిన ఇండియన్స్ కోసం వారి బంధువులు భయ భ్రాంతులకు గురి అవుతున్నారు.ట్రంప్ తీసుకునే నిర్ణయాలకు తమ వారికీ ఎం జరగకుండా క్షేమంగా ఉండేలా,ట్రంప్ మనసు మారేలా చేయమని బాలాజీని వేడుకుంటున్నారు.మొక్కులు చెల్లిస్తున్నారు.

భక్తుల భాదను అర్ధం చేసుకున్న ఆలయ అర్చకులు రంగరాజన్ ట్రంప్ శాశ్వతం కాదు బాలాజీ నే శాశ్వతం,వీసా ఇప్పించి పంపించిన బాలాజీ నే అక్కడ వారికీ రక్ష గా ఉంటాడు అన్నారు.భారం భగవంతుడు మీద వేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

]]>