భారతదేశం లోని అత్యంత పొడవైన రోడ్డు సొరంగం జాతికి అంకితం

ఆసియాలోనే అతి పెద్దదైన చెనని-నష్రి టన్నెల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారంప్రారంభించారు. 10.9 కిలోమీటర్ల ఈ రోడ్డు సొరంగం ద్వారా జమ్మూ, శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయం సుమారు రెండు గంటలు తగ్గుతుంది. టన్నెల్ ప్రారంభంలో మోదీతో పాటు జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరి, జితేంద్ర సింగ్ కూడా పాల్గొన్నారు. అనంతరం మోదీ, మెహబూబా ముఫ్తి తదితరులు టన్నెల్ మార్గం ద్వారా ప్రయాణించారు. ఈ టన్నెల్ నిర్మాణానికి రూ.3,700 కోట్లు వెచ్చించారు.

ఈ సొరంగం కారణం గా ఏడాదికి 99 కోట్ల రూపాయల ఇంధనం ఆదా  కానుంది ,రోజుకి 27 లక్షల ఇంధనం ఆదా అవుతుంది,అంతే కాకుండా జమ్మూ మరియు కాశ్మీర్ రాష్టాల మధ్య  ప్రయాణ సమయాన్ని రెండుగంటలు తగ్గించ వచ్చని మొత్తం దూరం 41 కిలోమీటర్ల లో 10.9 కిలోమీటర్లు తగ్గనుంది .

]]>