పోలవరం పనులు ఇంతేనా ఏపీ సీఎం ఫైర్

పోలవరం ప్రాజెక్టు పనులు ఆలస్యంపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. పోలవరం పనులపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించిన సీఎం,పోలవరంలో జరుగుతున్న పనుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.ఇరిగేషన్ మంత్రి దేవినేనిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.రివ్యూ నుంచి వెళ్లిపోగానే అన్ని వదిలేస్తున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎర్త్ వర్క్ విషయంలో లక్ష్యాన్ని చేరుకోలేకపోవడంపై నిర్మాణ సంస్థలను నిలదీసిన సీఎం.కాపర్ డ్యామ్ డిజైన్లు, నిధుల విడుదల, వర్కర్ల జీతాలు,తదితర అంశాలు సమావేశంలో ప్రస్తావించారు.మాటలు కాదు ప్రాక్టికల్‌గా రిజల్ట్ చూపాలంటూ క్లాస్ తీసుకున్నారు. పనిపై శ్రద్ధ లేకుంటే ఎలా అంటూ చురకలంటించారు . అధికారులు చెప్తున్న మాటలు నమ్మసక్యం గా లేవంటున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.సమావేశంలో ఇరిగేషన్ మంత్రి దేవినేని, ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

]]>