తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా ?శిరీష ఉదంతం లో

శ్మశానం ముందు ముగ్గు ఉండదు. రాజకీయ నాయకులకు సిగ్గు ఉండదు.. ఈ విషయం ప్రతి సంఘటన లోనూ నిరూపితమవుతోంది.. తాజాగా మధూకర్ విషయంలో కూడా..

మంథని మధూకర్ మృతి సంఘటనపై రాద్ధాంతం చేస్తున్న అ..మే…లారా ఒక్కరైనా అమ్మాయి కుటుంబం గురించి ఆలోచించారా? ఒక ఆడ పిల్ల జీవితాన్ని పణంగా పెట్టి రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్న రాబoధులారా వెంకటాపూర్ గ్రామంలో అమ్మాయి తల్లిదండ్రుల స్థిథిగతులను పరిశీలించారా?

నిరుపేద కుటుంబానికి చెందిన శిరీష తండ్రి ఆటో నడుపుకుంటూ తనకున్న కాస్త భూమిని విక్రయించి శిరీష పెళ్ళి కోసం ప్రయత్నాలు చెస్తున్నాడు. ఈ విషయం తెలిసిన శిరీష తల్లిదండ్రులతో మధూకర్ విషయాన్ని చెప్పలేక తనను మరిచిపోవాలని మధూకర్ కి చెప్పింది. మార్చి 13న శిరీష తల్లి ఆరోగ్యం బాగా లేకపోవడంతో శిరీష తండ్రి,శిరీష తల్లిని కరీంనగర్ ఆసుపత్రి కి తీసుకువెళ్ళాదు. ఈ క్రమంలో ఖానాపూర్ లో ఉన్న మధూకర్ తొ తన తల్లిదండ్రులని కాదని నిన్ను పెళ్ళి చెసుకోలేనని తన అశక్తతను వ్యక్తం చేయగా మధూకర్,శిరీషలు ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. దాంతో ఆదె రోజు శిరీష తన ఇంట్లో ఉన్న పురుగుల మందు సేవించగా మధూకర్ ఖానాపూర్ లో తాము అప్పుడప్పుడు కలిసి మాట్లాడుకునే రహస్య ప్రదేశంలో పురుగుల మందు సేవించాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని శిరీష కరీంనగర్ లొ ఉన్న తన తండ్రికి ఫోన్ లొ చెప్పగా ఆయన తమ ఇంటిపక్క రాజమ్మకు ఫోన్ చేసి తన బిడ్డ మందు తాగింది, కాపాడాలని విజ్ణప్తి చేయడంతో రాజమ్మ ఇరుగు పొరుగు వారు సాయంతో మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంథని లొ శిరీషకు ప్రాథమిక చికిత్స చేసి కరీంనగర్ కు తరలించారు. మరుసటి రోజు స్పృహలోకి వచ్చిన శిరీష అక్కడి నర్స్ సెల్ తో మధూకర్ సెల్ కు ఫోన్ చేయగా మధూకర్ సోదరుడు ఫోన్ ఎత్తడంతో మధూకర్ గురించి వాకబు చేయగా నిన్నటి నుండి కనిపించడం లేదని అతని సోదరుడు చెప్పడంతో ఫలానా చోట మధూకర్ పురుగుల మందు తాగి పడి ఉన్నాడు వెల్లి కాపాడండని వారిరువురు అప్పుడప్పుడు కలుసుకుని మాట్లాడుకునే ప్రదేశం ఫెరు చెప్పింది. మధూకర్ బందువులు శిరీష చెప్పిన ప్రదేశం చుట్టుపక్కల నలువైపులా వెతుకగా మధూకర్ మృతదేహం లభించింది. మధూకర్ తల్ల్లిదండ్రులు అనుమానాస్పద మృతి అని ఫిర్యాదు చేయడం పోస్ట్ మార్టం నిర్వహించడం అనంతరం పరిణామాలు తెలిసినవే .(మరో సారి పోస్ట్ మార్టం జరుపనున్నారు ).

రాజకీయ లబ్దికోసం మధూకర్ మృతదేహం ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి అందరిని తప్పుదోవ పట్టించడమే కాకుండా దళిత సంఘాలను రెచ్చగొట్టి నానా యాగీ చేస్తున్నారు.

మధూకర్ మృతిపై విశేశంగా స్పందించిన ఓ సోకాల్డ్ మేధావుల్లారా ఏరోజైనా వెంకటాపూర్ వచ్చారా? గ్రామంలో శిరీష తల్లిదండ్రుల పరిస్థితి ఏంటని తెలుసుకున్నారా? మీ కోణంలో చూస్తే మధూకర్ బందువులతో పాటు శిరీష కూడా బాదితురాలే కదా పోనీ ఆమెనైనా పరామర్శించి ఏంజరిగిందనే విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించారా?

మధూకర్ మృతికి రాజకీయ రంగు పులిమి లబ్దిపొందాలని చూస్తున్న అపర మేధావుల్లారా రేపు మధూకర్ ది ఆత్మహత్య అని తేలితే శిరీష బతుకును బజారుకీడ్చిన మీ అందరిని ఏ విదంగా శిక్షించాలి? రాజకీయ లబ్దికోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని ఫణంగా పెట్టి మిమ్మల్ని తప్పుదోవ పట్టించి నానా రాధ్దాంతానికి కారకుడైన వ్యక్తికి ఏ శిక్ష వేయాలి.⁠⁠⁠?

సోర్స్ :ఫ్రీ లాన్స్ రిపోర్టర్ 

]]>