పోలీస్ గా మారిన శివగామి..

srimaha

తెలుగు .. తమిళ భాషల్లో హీరోయిన్ గా రమ్యకృష్ణ ఒకప్పుడు తన నటనతో ప్రేక్షకులను కట్టి పడేసింది. ఇప్పటికి ఏ మాత్రం తాగ్గకుండా తన నటనను అందంగా అభినయిస్తున్న రమ్యకృష్ణ కి మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి.వరుస సినిమాలు చేస్తోంది. ఆమె చేస్తోన్న సినిమాల్లో ‘బాహుబలి 2’ పూర్తి కాగా ‘శభాష్ నాయుడు’ సెట్స్ పై వుంది.తమిళం లో సూర్య హీరో గా విఘ్నేష్ శివన్ తెరకెక్కించనున్న ‘తానా సెరిందా కూట్టం’లోను ఒక ముఖ్యమైన పాత్రను చేయనుంది. ఈ సినిమాలో రమ్య కృష్ణ  పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర లో కనిపించనుందట. ఈ పాత్ర తనకి మరింత పేరు తీసుకువస్తుందని రమ్యకృష్ణ భావిస్తోంది.

]]>